Forbes India: అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌కు ఐదో స్థానం

ప్రస్తుతం ప్రపంచంలో భారత్ పేరే మార్మోగిపోతోంది. కొన్ని రోజులుగా భారతీయులందరూ ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. తాజాగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాల్లో భారత్ ఐదో స్థానానికి చేరి మరో కీర్తి కిరీటం తన ఖాతాలో వేసుకుంది. అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా టెక్నాలజీలో అగ్రదేశాలకు సవాల్ విసురుతోంది.

Forbes India: అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌కు ఐదో స్థానం
New Update

అగ్రరాజ్యాలకు భారత్ సవాల్.. 

ప్రస్తుతం ప్రపంచంలో భారత్ పేరే మార్మోగిపోతోంది. కొన్ని రోజులుగా భారతీయులందరూ ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్‌తో మొదలైన భారత విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు మోపిన తొలి దేశంగా అవతరించడం, సూర్యుడిపై ప్రయోగం విజయవంతం అవ్వడం, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కొట్టడం, చెస్ వరల్డ్‌కప్‌లో ప్రజ్ఞానంద రన్నరప్‌గా నివలడంతో ఇండియన్స్ సంబరపడిపోతున్నారు. తాజాగా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాల్లో భారత్ ఐదో స్థానానికి చేరి మరో కీర్తి కిరీటం తన ఖాతాలో వేసుకుంది. అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా టెక్నాలజీలో అగ్రదేశాలకు సవాల్ విసురుతోంది.

3,750 బిలియన్ డాలర్లతో ఐదో స్థానం..

తాజాగా ఫోర్స్బ్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అభివృద్ధి చెందిన టాప్ 10 దేశాల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ యూకే దేశాన్ని దాటి ఐదో స్థానం దక్కించుకుంది. . ప్రస్తుతం భారత జీడీపీ 3,750 బిలియన్ డాలర్లుగా ఉండగా.. తలసరి ఆదాయం 2,601 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశ వార్షిక జీడీపీ వృద్ధిరేటు 5.9 శాతంగా ఉంది. ఇక ఈ లిస్ట్‌లో 26,854 బిలియన్ డాలర్ల జీడీపీతో మొదటి స్థానంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. 19,374 బిలియన్ డాలర్ల జీడీపీతో చైనా.. 4,410 బిలియన్ డాలర్లతో జపాన్.. రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 3,159 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో యూకే, 2,924 బిలియన్ డాలర్లతో ఫ్రాన్స్, 2,170 బిలియన్ డాలర్లతో ఇటలీ, 2,090 బిలియన్ డాలర్లతో కెనడా, 2,080 బిలియన్ డాలర్లతో బ్రెజిల్.. ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు దక్కించుకున్నాయి.

ఆసియా దేశాల పరంగా చూస్తే చైనా ముందుండగా.. జపాన్ రెండో స్థానంలో.. భారత్ మూడో స్థానంలో నిలిచాయి. తర్వాత సౌత్ కొరియా, ఇండోనేషియా, సౌద్ అరేబియా దేశాలు ఈ జాబితాలో స్థానాలు దక్కించుకున్నాయి. 

ఇక ప్రపంచంలోని 10 పేద దేశాల జాబితాను పరిశీలిస్తే.. బురుండి, సిరియా లియోనో, మలావి, సెంట్రల్ ఆఫ్రికన్ ఆఫ్‌ రిపబ్లిక్, సోమాలియా, సౌత్ సూడాన్, నైజర్, మొజాంబిక్, ఎరిటీరియా, మడగాస్కర్ దేశాలు ఉన్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe