Elections:మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో ముగిసిన ప్రచారం, రేపు పోలింగ్

New Update
కాసరగోడ్‌ ఎన్నికల్లో బీజేపీకి అదనపు ఓట్లు..ఆరోపిస్తున్న ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్

ప్రచారాలతో హోరెత్తిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు రేపు తుది అంకానికి చేరుకోనున్నాయి. ఇక్కడ పార్టీల భవిష్యత్తును ఓటర్లు తేల్చనున్నారు. ఎవరు గెలుస్తారు అన్నది సర్వేలు, చరిత్రలు చెప్పినప్పటికీ ఓటర్లు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎవ్వరూ చెప్పలేరు. రెండు రాష్ట్రాల్లోనూ పలు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే తీవ్ర పోటీ ఉంది. మధ్యప్రదేశ్ లో బీఎస్పీ, సమాజ్ వాద్ పార్టీ, కమ్యూనిస్టులు కూడా బరిలో ఉన్నారు.

మధ్యప్రదేశ్...

మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇందులో 22.36మంది మొదటి సారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతోంది. ఇక్కడ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే అని దాదాపు ఎన్నికల సర్వేలు తేల్చేశాయి. మధ్యలో ఏడాదిన్నర మినహాయిస్తే 20 ఏళ్ళుగా ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీపై ప్రజల్లో వ్యతిరికేత ఉన్నట్టు తెలుస్తోంది. దానికి తోడు మధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని లాక్కుని ప్రభుత్వాన్ని కూల్చేసిన వైనం ఇవన్నీ కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారాయి. దీంతో ఈసారి ఎలాగైనా గట్టెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది బీజేపీ. కానీ కాంగ్రెస్ విసురుతున్న ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అవతల కాంగ్రెస్ కు కూడా అంత ఈజీగా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు తోడు, అగ్రవర్ణాల మద్దతు లేకపోవడం, నిమ్న వర్గాలపై అతిగా ఆధారపడటం, సీనియర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుండటమే ఇందుకు కారణం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లను నమ్ముకుని బరిలోకి దిగుతోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలు ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నారు. కులాల సర్వే హామీతో ఓబీసీ ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. కానీ ఇందులో ఎక్కడ తేడా వచ్చినా ఎన్నికల్లో భారీ దెబ్బలు ఖాయం.

Also Read:మిర్యాలగూడలో ఐటీ దాడులు.. భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు.

ఛత్తీస్ ఘడ్ లో రెండో విడత...

ఛత్తీస్ ఘడ్ లో ఇప్పుడు రెండో విడత పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 7న మొదటి విడతగా 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ అయిపోయింది. ఇప్పుడ మరో 70 సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో మొత్తం 958 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 1.63 కోట్ల ఓటర్లు రేపు వీరి భవితవ్యం తేల్చనున్నారు. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ బీజేపీ మాత్రం అధికార పార్టీపై తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణలతో తన ప్రచారాన్ని చేసింది. దానికి తోడు ప్రస్తుత ముఖ్యమంత్రి బఘేల్ కు డబ్బులు ఇచ్చానంటూ మహదేవ్ యాప్ ఓనర్ చేసిన ఆరోపణలు కూడా కాంగ్రెస్ ను దెబ్బ తీసేలా ఉన్నాయి. అయితే ఛత్తీస్ ఘడ్ లో రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, ప్రియాంక గాంధీ తెగ ప్రచారం చేశారు. బీజేపీ కూడా గట్టిగానే ప్రచారం చేసింది.ఈ పార్టీ తరఫున అమిత్‌ షా, జేపీ నడ్డా, హిమంత బిశ్వశర్మ, అనురాగ్‌ ఠాకూర్‌తోపాటు ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు