రోహిత్ శర్మనే కాదు.. టమాటా కూడా డబుల్ సెంచరీలు కొడుతుంది..! కిలో టమాటా రూ.200 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. టమాటాతో చేసే వంటకాలకు ఎందరో ప్రియులుంటారు. అలాంటివారికి టమాటా ధర మింగుడు పడటం లేదు. హైదరాబాద్ మార్కెట్‌లో టమాటా హోల్ సేల్ ధర కిలో130 రూపాయలు పలుకుతోంది. ఇది రిటైల్ దగ్గరకు వచ్చే సరికి 150 రూపాయలు దాటుతోంది. కొన్ని చోట్లా కూరగాయల షాపుల్లో కిలో టమాటాను రూ.200కి విక్రయిస్తున్నారు.! By Trinath 04 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుతం కూరగాయలు కొనాలంటేనే భయం వేస్తోంది. ముఖ్యంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా టమాటా ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా ఈ సీజన్ లో టమాటా ధర చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో బాక్స్ ధర రూ. 500 లోపే ఉంటుంది. కానీ.. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. దీనికి కారణం డిమాండ్‌కు తగట్లు సప్లై లేకపోవడమే అంటున్నారు వ్యాపారులు. గత రెండు నెలల క్రితం రైతులు టమాటా పంటను నమ్ముకొని తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో చాలా మంది రైతులు టమాటా సాగు కాకుండా ఇతర పంటలకు వైపు మొగ్గు చూపారు. అందుకే ఇప్పుడు టమాటా చాలా చోట్లా కిలో టమాటా 150రూపాయలు దాటేసింది.. కొన్ని చోట్లా కూరగాయల షాపుల్లో కిలో టమాటాను రూ.200కి విక్రయిస్తున్నారట.! ఇదంతా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇలానే ఉంది. ఊరూ,వాడా అన్ని చోట్లా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. టమాటా లేకపోతే కూరలు రుచి ఉండవు. కొందరికి టమాటాలు లేనిదే వంటే జరగదు. అలాంటి వారందరికీ టమాటా అందని ద్రాక్ష అవుతుంది. కనీసం ఒక కిలో కొందామన్న.. దిగిరానంటోందీ ఎర్రపండు. టమాటాతో పాటు మిర్చి కూడా ధర ఎక్కువగానే ఉంటోంది. కిలో మిర్చి రూ.120 పైమాటే. హైదరాబాద్‌లో మండుతున్న టమాటా ధర: హైదరాబాద్‌లోని వివిధ మార్కెట్లకు ప్రతిరోజూ సుమారు 1,500 టన్నుల వరకు టమాటాలు దిగుమతి అవుతుంటాయి. అయితే.. ప్రస్తుతం 750 టన్నుల టమాటాలు మాత్రమే హైదరాబాద్‌లోని వివిధ మార్కెట్లకు సరఫరా అవుతున్నాయి. అంటే సగానికి సగం టమాటాలు రాక తగ్గిపోయిందని చెప్పొచ్చు. దీంతో వ్యాపారులు.. వచ్చిన సరుకును వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో టమాటా హోల్ సేల్ ధర కిలో130 రూపాయలు పలుకుతోంది. ఇది రిటైల్ దగ్గరకు వచ్చే సరికి 150 రూపాయలు దాటుతోంది. రానున్న 20 రోజుల వరకు కొత్త సరుకు రాదంటున్నారు. అంటే ఏ లెక్కన చూసిన కిలో టమాటా చాలా చోట్లా రూ.200మార్కును టచ్ చేసేలా కనిపిస్తోంది. నిజానికి గతంలో కూడా టమాటా ఇలానే 200మార్క్‌ని టచ్ చేసినట్లు గణంకాలు చెబుతున్నాయి. నార్త్ ఇండియాలో కొన్నిసార్లు ఈ పరిస్థితి కనిపించగా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మండుతున్న టమాటా ధర సబ్సిడీపై అమ్ముతున్న రాష్ట్రాలు: జనం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే సబ్సిడీపై టమాటాలు విక్రయిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సర్కార్ కిలో టమాటా రూ.50కే అమ్ముతోంది. మూడు నాలుగు రోజులుగా రైతు బజార్లలో వాటిని విక్రయిస్తున్నది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా టమాటాలు తెప్పిస్తోంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కిలో రూ.60కే టమాటాలు విక్రయించాలని నిర్ణయించింది. ధరల పెరుగుదలపై సివిల్‌సప్లయీస్ అధికారులతో రివ్యూ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్.. ప్రజలకు అందుబాటులో ఉండేలా రేషన్ షాపుల్లో టమాటాలు అమ్మాలని ఆదేశించారు. ఇవాళ్టి(జులై 4) నుంచి కిలో రూ.60కే టమాటాలను రేషన్ షాపుల్లో విక్రయించనున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ, తమిళనాడు లాగా టమాటాను సబ్సిడికి అందిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి