తానా సభల్లో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లపై మండిపడ్డ బండ్ల గణేశ్

అగ్రరాజ్యమైన అమెరికా పేరు చెప్పగానే చాలామంది ప్రపంచ దేశాల్లో కెల్లా అత్యంత ధనిక దేశంగా చెప్పుకుంటారు. అంతే కాకుండా సాంకేతిక పరంగా మనతో పోలిస్తే చాలా సంవత్సరాలు ముందున్నారని చెప్పుకోవాలి. అలాంటి అమెరికాలో మన తెలుగోళ్లు మన జాతీయ జెండాను ఎగురవేస్తూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం మన జాతిని, గౌరవాన్ని, సంప్రదాయాలను అక్కడి ప్రజలకు చూపిస్తూ మన కీర్తిని చాటారు. అయితే దీనిపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు.

తానా సభల్లో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లపై మండిపడ్డ బండ్ల గణేశ్
New Update

చినికి చినికి గాలివానలా..?

తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని అర్ధం. అమెరికాలోని ఉత్తర అమెరిగా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన సభలో తెలుగు తమ్ముళ్లు కొడ్లాడుకున్నారు. ఇంకో అడుగు ముందుకు వేసి తన్నుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది చినికి చినికి గాలివానలా మారింది. చివరికి ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకొని తన్నుకునే స్ధాయికి చేరుకుంది. గతంలో రెండుగా చీలిపోయిన తెలుగు దేశం పార్టీ ఎన్నారై సభ్యులు ఒకరినొకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు.

ఎన్నారై అధ్యక్షుడి ముందే ఫైటింగ్

ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం చూస్తుండగానే ఒకరిని ఒకరు కొట్టుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన మొత్తం వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతూ తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన టాలీవుడ్ కమెడియన్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దీనిపై తనదైన స్టైల్ లో సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. అంతేకాదు టీడీపీ సీనియర్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.

విరుచుకుపడ్డ బండ్ల గణేష్

అలాంటి తెలుగువాళ్లు ఇప్పుడు మన పరువును బజారుకు ఈడుస్తున్నారని చెప్పక తప్పదు. అగ్రరాజ్యమైన అమెరికా వేదికగా‘తానా పరువు తీస్తున్నారు కదా దాన్ని నిర్మించడానికి ఎంతో మంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా.. సిగ్గులేదా మీకు జీవితంలో బుద్ది రాదు మీ బతుకులు చెడ’ అంటూ తనలోని ఆవేదనను సోషల్‌మీడియా వేదికగా వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఇది చూసిన నెటిజన్లు ఏందిరయ్యా.. మధ్యలో నీ లొల్లి అంటూ బండ్ల గణేష్‌పై విరుచుకుపడుతున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe