Chiranjeevi: క్లీంకారతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వినాయకచవితి సెలబ్రేషన్స్..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు క్లీంకారతో కలిసి తొలి వినాయకచవితి వేడుకలు జరుపుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

New Update
Chiranjeevi: క్లీంకారతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వినాయకచవితి సెలబ్రేషన్స్..!!

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు క్లీంకారతో కలిసి తొలి వినాయకచవితి వేడుకలు జరుపుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి వాతవరణం నెలకొంది. చిరంజీవి నివాసంలో వినాయకచవితి పండుగకు ఓ స్పెషల్ ఉంది. చిరంజీవి తన మనవరాలు క్లీంకారతో కలిసి తొలి వినాయకచవితి వేడుకలు జరుపుకోవడం విశేషంగా మారింది. దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్థిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఈసారి ప్రత్యేకత..చిన్నారి క్లీంకారతో కలిసి తొలి వినాయకచవితి జరుపుకోవడం అని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు. మెగా ఇంట గణేశుడి పూజలో చిరంజీవి తల్లి అంజనాదేవి, అర్ధాంగి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. చీరంజీవి పోస్ట్ చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు