ఆనాటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నాను: మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. చిరంజీవి ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు తమ వంతు సాయం చేస్తున్న అక్కాచెల్లెళ్లు, అభిమానులకు, సోదరులకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. మన దేశానికి మనం చేస్తున్న చిరు సాయమిదని అన్నారు. సాయం చేస్తే వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేమని తెలిపారు.

ఆనాటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నాను: మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం..!!
New Update

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఛారిటబుల్ ట్రస్ట్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించిన ఆనాటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నానని చెప్పారు. సమాజ సేవలో ఇదొక అద్భుతమైన జర్నీ అని అన్నారు. ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్ల బ్లడ్ సేకరించామని, వాటిని అవసరమైన వారికి అందించామని చెప్పారు. ఐ బ్యాంక్ ద్వారా 10 వేల మందికి కంటి చూపునిచ్చామని తెలిపారు. చిరంజీవి ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు తమ వంతు సాయం చేస్తున్న అక్కాచెల్లెళ్లు, అభిమానులకు, సోదరులకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. మన దేశానికి మనం చేస్తున్న చిరు సాయమిదని అన్నారు. సాయం చేస్తే వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేమని తెలిపారు.

1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సాయం చేశారు. ఈ ట్రస్ట్ తరఫున బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఆయన అభిమానుల ద్వారా సేకరించిన రక్తాన్ని ఆపదలో ఉన్నవారికి అందించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు ‘బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్’ అవార్డును అందించింది. ఆ తర్వాత 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను.. చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్ గా మార్చారు.

అప్పటి నుంచి బ్లడ్ బ్యాంక్ తో పాటు ఐ బ్యాంక్ ని ప్రారంభించి వారి సేవలను మరింతగా విస్తరిస్తూ వచ్చారు. ఇక ఇటీవల కరోనా కష్ట కాలంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ పేరుతో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగించారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు అందించారు. ఇలా పలు సేవ కార్యక్రమాలతో మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద మనసుని చాటుకుంటున్నారు.

Also Read: ఏ మాత్రం తగ్గని ఐశ్వర్యారాయ్ క్రేజ్‌.. ఈ వయసులోనూ ఏం చేసిందంటే..?

#megastar-chiranjeevi #chiranjevi-charitable-trust
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe