రామ్ చరణ్, ఉపాసన కొన్ని రోజుల క్రితేమే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. జూన్ 20న అపోలో ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డను ప్రసవించింది ఉపాసన. పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్ దంపతులకు మహాలక్ష్మి జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సంతోషం వెల్లివిరిసింది. ఇక మెగా ప్రిన్సెస్ వచ్చింటూ అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోయారు. అనంతరం లలితా సహస్రనామం పదాలు కలిసేలా తమ కూతురుకు క్లీంకార అని నామకరణం చేశారు.
కూతురు విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ
కాగా...కూతురు విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తమ బిడ్డ ఆహ్లాదకర వాతావరణంలో పెరిగేందుకు ఒక ప్రత్యేక గదిని సిద్ధం చేశారు రామ్ చరణ్ దంపతులు. స్పెషల్ రూం అనగానే అత్యాధునిక హంగులు అని అర్థం కాదు. చిన్నారి పెరిగేందుకు అనువైన వాతావరణం ఉండేలా పిల్లలు కోరుకునే బొమ్మలతో గదిని అందంగా తీర్చిదిద్దారు. ఫారెస్ట్ థీమ్‌లో అంటే అడవిలో ఉండే జంతువుల బొమ్మలు, చెట్లు ఉండే గదిని చాలా చక్కగా ప్రముఖ ఆర్కిటెక్ట్ మేకర్స్‌తో డిజైన్ చేయించారు.
ఆహ్లాదభరితంగా ఉండేలా గది ఏర్పాటు
అలాగే వైట్ థీమ్‌లో సోఫాలు, మ్యాట్‌లు, టేబుల్స్ ఇలా ఎంతో ఆహ్లాదభరితంగా ఉండేలా గదిని ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ ఈ స్పెషల్ రూమ్‌ను డిజైన్ చేయించారు. తాజాగా తన కూతురుకు సంబంధించిన గదిని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో తెగ వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మెగాభిమానులంటే ఆ మాత్రం ఉండాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.