రష్మిక టాలీవుడ్లో చాలా మూవీస్‌లో యాక్ట్ చేసింది. తానూ నటించిన అన్ని సినిమాల్లోనూ తన నటనతో అబ్బురపరుస్తూ హౌరా అనిపిస్తుంది. అంతేకాదు మూవీ షూటింగ్స్ నుంచి కాస్త ఖాళీ టైం దొరికినా సరే రష్మిక తన ఫ్యాన్స్‌తో ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ చిత్రం షూటింగ్ గ్యాప్‌లో నెటిజన్లతో ఆమె సరదాగా ముచ్చటించారు. వాళ్లు అడిగిన క్వశ్చన్స్కు సమాధానాలు చెప్పారు.
నమస్తే.. ఎట్లా ఉన్నారు అంటూ తెలంగాణ యాసలో మాట్లాడిన రష్మిక
మీకు ఇష్టమైన ప్లేస్ ఏదని నెటిజన్స్ అడగ్గా.. ‘కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న మా ఇల్లు అంటే ఎంతో ఇష్టం’ అని రష్మిక జవాబిచ్చారు. తనకు మొత్తంగా ఆరు భాషలు వచ్చని ఆమె తెలిపారు. హైదరాబాద్ యాసలో మాట్లాడమని ఒక నెటిజన్ రష్మికను అడిగగా దానికి ఆమె.. ‘నమస్తే.. ఎట్లా ఉన్నారు? వచ్చేశెయ్. మస్తు ఉంది’ అంటూ క్యూట్‌గా తెలుగులో మాట్లాడేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ మాట్లాడి అందర్నీ ఆమె అలరించారు. నటించడం అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఈ ప్రొఫెషన్‌ను తాను ఎంతగానో ప్రేమిస్తున్నట్లు రష్మికా మందన్న తెలిపారు.
కొరియన్ ఫ్రైడ్ చికెన్ అంటే చాలా ఇష్టం
ఇక ఫుడ్ విషయానికొస్తే.. తనకు కొరియన్ ఫ్రైడ్ చికెన్ అంటే చాలా ఇష్టమని రష్మిక చెప్పుకొచ్చారు. ఆహారం సంగతిని పక్కనబెడితే.. రష్మిక హైదరాబాద్ యాసలో మాట్లాడటం ఇంట్రెస్టింగ్గా మారింది. ఫేవరెట్ హైదరాబాద్ ఫ్రెండ్ ఎలా మాట్లాడతాడో అలా కొన్ని డైలాగ్స్ చెప్పి అందర్నీ అలరించారామె. అయితే ఫేవరెట్ ఫ్రెండ్ అంటే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించే కదా అని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. రష్మిక మాటలు అచ్చం విజయ్ను తలపిస్తున్నాయని కొందరు నెటిజన్స్ కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’లో యాక్ట్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ సరసన ‘యానియల్’లో నటిస్తున్నారు.