Venu Thottempudi : ఓటీటీలోకి మరో మాజీ హీరో..!

థియేటర్లలో క్లిక్ అవ్వని నటీనటులంతా నేరుగా ఓటీటీలోకి ప్రవేశిస్తున్నారు. వెంకటేష్ లాంటి ఒకరిద్దరు దీనికి మినహాయింపు. ఇప్పటికే చాలామంది తారలు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నటుడు చేరిపోయాడు. అతడే వేణు తొట్టెంపూడి.

New Update
Venu Thottempudi : ఓటీటీలోకి మరో మాజీ హీరో..!

Venu Thottempudi: థియేటర్లలో క్లిక్ అవ్వని నటీనటులంతా నేరుగా ఓటీటీలోకి ప్రవేశిస్తున్నారు. వెంకటేష్ లాంటి ఒకరిద్దరు దీనికి మినహాయింపు. ఇప్పటికే చాలామంది తారలు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నటుడు చేరిపోయాడు. అతడే వేణు తొట్టెంపూడి(Venu Thottempudi).

స్వయంవరం సినిమాతో హీరోగా మారిన ఈ పొడుగు హీరో, ఆ తర్వాత మంచి హిట్స్ ఇచ్చాడు. తర్వాత కామెడీ హీరో అనిపించుకున్నాడు. తన విలక్షణమైన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో తక్కువ టైమ్ లోనే ప్రేక్షకుల మన్ననలు పొందాడు. అయితే ఆశించిన స్థాయిలో అతడి కెరీర్ పరుగులు పెట్టలేదు. చూస్తుండగానే కెరీర్ లో వేగం కోల్పోయి, ఇండస్ట్రీకి దూరమయ్యాడు వేణు.

రీసెంట్ గా రవితేజ(Raviteja) హీరోగా నటించిన ఓ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు వేణు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో వేణు ఆశలు ఫలించలేదు. ఫలితంగా మరోసారి సిల్వర్ స్క్రీన్ కు దూరమవ్వాల్సి వచ్చింది. అలా వెండితెరకు దూరమైన ఈ హీరో, ఇప్పుడు ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.

publive-image

టాలెంటెడ్ యాక్టర్ వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ “అతిథి”. ప్రముఖ ఓటీటీ కంపెనీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. “అతిథి” వెబ్ సిరీస్ ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు భరత్ వైజీ రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు.

publive-image

తాజాగా “అతిథి” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే...ఒంటరిగా పెద్ద భవంతిలో ఉంటున్న వేణుకు దెయ్యాలంటే నమ్మకం ఉండదు. ఎక్కడో ఒక ఆడది దెయ్యంగా మారిందని, అమ్మాయిలందరూ దెయ్యలంటే ఎలా అని అడుగుతాడు. మీ ఇంట్లో ఉన్నది మనిషి కాదు దెయ్యం అని తన మిత్రుడు చెప్పినా నమ్మడు. కానీ ఆ అమ్మాయి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇంతకీ ఆమె ఎవరు?, మనిషా, దెయ్యామా? అనేది సిరీస్ లో చూడాలి.

publive-image

మేకింగ్ క్వాలిటీ, యాక్టర్స్ పర్ ఫార్మెన్స్, ట్రైలర్ లో ట్విస్ట్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్ని కథలు మొదలుపెట్టడం సులువు, ముగించడం కష్టం, కథలకు ముగింపు ఇద్దామా అనే డైలాగ్స్ “అతిథి” పై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19 నుంచి “అతిథి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో వేణు క్లిక్ అయితే, అతడికి కొత్త ద్వారాలు తెరుచుకున్నట్టే.

Also Read:మొదటి రోజే వంద కోట్లు.. సినిమాల లిస్ట్ ఇదిగో

Advertisment
తాజా కథనాలు