Sharwanand to Become Father : టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో శర్వానంద్. సైడ్ కారెక్టర్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన ఇతను ఆ తర్వాత హీరోగా రాణిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేస్తున్నారు. విభన్నమైన సినిమాలు చేస్తూ మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పడి పడి లేచే మనసు వంటి చిత్రాలతో బాగా పాపులర్ అయ్యాడు.
శర్వానంద్ ఈ ఏడాది జూన్ లో ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కి ముగింపు పలికాడు. రక్షిత రెడ్డి (Rakshitha Reddy) అనే యువతితో జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
Also Read: మెగా ప్రిన్స్ పెళ్ళి వచ్చేది ఆ ఓటీటీలోనేనా…
తాజాగా శర్వానంద్ ఫ్యామిలీ మరోసారి సంబరాల్లో మునిగితేలే క్షణాలు వచ్చేశాయి. అందుతున్న సమాచారం మేరకు శర్వానంద్, రక్షిత రెడ్డి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంత వరకు శర్వానంద్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించలేదు.
ప్రస్తుతం రక్షిత అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. శర్వానంద్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. భార్య కోసం అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఉండి.. భార్య రక్షితా రెడ్డి బాగోగులు చూసుకుంటాడట. దీంతో సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇస్తారని తెలుస్తోంది.
సినిమాల విషయానికి వస్తే శర్వానంద్ 35వ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో శర్వా సరసన యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో.. ఇతర సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read: Bigg Boss 7 Telugu Promo - నాన్న ఏడవకు.. నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరు ఏడుస్తారు..!