Prabhas: డార్లింగ్ ఫాన్స్‌ కు గుడ్ న్యూస్‌..!!

రెబల్ స్టార్‌ ప్రభాస్ ఫాన్స్ కు గుడ్ న్యూస్. ప్రభాస్ బర్త్ డే రోజునే 'సలార్' ట్రైలర్! విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే మూవీ 'సలార్'. ఈ మూవీలో హీరో ప్రభాస్ జోడీగా శ్రుతి హాసన్ అలరించనుంది. 'సలార్' సినిమా ఫస్టు పార్టు కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Prabhas: డార్లింగ్ ఫాన్స్‌ కు గుడ్ న్యూస్‌..!!
New Update

Prabhas: రెబల్ స్టార్‌ ప్రభాస్(Rebel Star Prabhas) ఫాన్స్ కు గుడ్ న్యూస్. ప్రభాస్ బర్త్ డే రోజునే 'సలార్' ట్రైలర్! విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే మూవీ 'సలార్'. ఈ మూవీలో హీరో ప్రభాస్ జోడీగా శ్రుతి హాసన్(Shruti Haasan) అలరించనుంది. 'సలార్' సినిమా ఫస్టు పార్టు కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

publive-image

ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు 'సలార్' కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, బొగ్గు గనుల నేపథ్యంలో నడిచే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

డిసెంబర్ 22న 'సలార్' ఫస్టు పార్టును విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలకి ఇంకా రెండు నెలల వరకూ సమయం ఉంది. అందువలన ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టాలని ఈ సినిమా టీమ్ భావిస్తోందని అంటున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

publive-image

మాస్ ఆడియన్స్ ఆశించినట్టుగానే ఈ సినిమాలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఆయన సరసన శ్రుతి హాసన్  సందడి చేయనుంది. ఒక కీలకమైన పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కనిపించనున్నాడు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈనెల 23న ప్రభాస్ పుట్టిన‌రోజు. ఈ బ‌ర్త్ డేని ప్రభాస్ విదేశాల్లోనే సెల‌బ్రేట్ చేసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలో లేడు. త‌న పుట్టిన రోజు అయిపోయిన త‌ర‌వాతే… ఇక్కడికి తిరిగొస్తాడని తెలుస్తోంది.  త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితులు ప్రభాస్ పుట్టిన‌రోజు ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి  ఫారెన్ వెళ్లబోతున్నారని సమాచారం.

Also Read: సమంత ఒంటిపై నాగచైతన్య టాటూ..నెట్టింట్లో వైరల్..!!

#salar-movie #prabhas-fans
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe