Drugs Case: డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్ యంగ్ హీరో లవర్‌.. ఆ హీరో ఇతడేనా?

డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్ యంగ్‌ హీరో లవర్‌ లావణ్య పట్టుబడ్డారు. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు గుర్తించిన ఎస్‌వోటీ పోలీసులు.. ఆమె వద్ద 4గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. లావణ్య ప్రేమికుడైన ఆ హీరో ఎవరు? ఇందులో అతని పాత్ర ఏమిటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

New Update
Drugs Case: డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్ యంగ్ హీరో లవర్‌.. ఆ హీరో ఇతడేనా?

Drugs Case: టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా, డ్రగ్స్‌ కేసులో లావణ్య అనే యువతి పట్టుబడ్డింది. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు గుర్తించిన ఎస్‌వోటీ పోలీసులు.. ఆమె వద్ద 4గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. అయితే, నిందితురాలు ఓ యంగ్‌ హీరో ప్రియురాలిగా గుర్తించారు. ఆ హీరో పేరును గోప్యంగా ఉంచారు పోలీసులు. ఇందులో అతని పాత్ర ఏమిటనే దానిపై ఆరా తీస్తున్నారు.

Also Read: కళ్యాణ్, కావ్య ప్లాన్ సక్సెస్.. రాజ్ కు ఇక నుండి చుక్కలే..!

NDPS యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు..లావణ్య ఎవరి నుంచి డ్రగ్స్‌ కొన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సినీ పరిశ్రమలో వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఆమె డ్రగ్స్ ఎవరి కోసం తెచ్చింది? ఎందుకు తెచ్చింది? అని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఇంతకు లావణ్య ప్రియుడు ఎవరు? అని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: క్రిమినల్‌ కేసులో కొరటాలకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

సోషల్ మీడియాలో మాత్రం లావణ్య లవర్ హీరో రాజ్ తరుణ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, నిజంగానే  రాజ్ తరుణ్ లవరా? లేదంటే వేరే హీరో  ఇంకేవరైనా ఉన్నారా? అని చర్చలు జరుగుతున్నాయి. త్వరలో దీనిపై పోలీసులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే, గతంలో కూడా డ్రగ్స్ కేసుల్లో టాలీవుడ్ హీరో హీరోయిన్ల పేర్లు నమోదయ్యాయి. డ్రగ్స్ వాడుతున్న వారిలో ఎక్కువగా ఉన్నత కుటుంబాలకు చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు