Vishweshwar Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు విశ్వేశ్వర రావు మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 2న తుది శ్వాస విడిచారు.

New Update
Vishweshwar Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత

Vishweshwar Rao: ప్రముఖ హాస్య నటుడు విశ్వేశ్వర రావు మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో ఏప్రిల్ 2వ తేదీన తుది శ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. కాగా రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Gaami Ott Release: ఓటీటీలోకి మాస్ కా దాస్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

విశ్వేశ్వర రావు సినీ జీవితం

కాకినాడలో పుట్టిన ఆయన 1966లో పొట్టి ప్లీడర్ అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ అడుగు పెట్టారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన విశ్వేశ్వర రావు తెలుగు, తమిళంలో సుమారు 350 సినిమాలకు పైగా చేశారు. యుక్త వయస్సుకు రాగానే సినిమాలు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన MSC చదువుకొని ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చిన విశ్వేశ్వర రావు అనేక సినిమాల్లో నటించి అలరించారు.

publive-image

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. ఆయన తన ఆరేళ్ల వయస్సు నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నారు. సుమారు 350కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమె కథ, ముఠామేస్త్రీ, బిగ్ బాస్, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివాజీ వంటి చిత్రాలు చేశారు.

బుల్లితెరపై కూడా రాణించిన ఆయన.. విస్సు టాకీష్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేశారు. అందులో సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేసేవారు. అంతే కాదు నందమూరి తారకరామారావు, జయలలిత, ఎంజీఆర్‌లతో లాంటి గొప్ప నటులతో పనిచేయడం తనకెంతో గర్వమని చెప్పుకునేవారు ఆయన.

Also Read: Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలే.. పుష్ప 2 టీజర్ డేట్ వచ్చేసింది..!

Advertisment
Advertisment
తాజా కథనాలు