Bandla Ganesh: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ పై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్(Bandla Ganesh) స్పందించారు. చంద్రబాబు జాతీయ సంపద అని అభిప్రాయపడ్డారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. చంద్రబాబు పేరు చెప్పుకుని ఎంతో మంది బాగుపడ్డారని అన్నారు. బాబు అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందని వాపోయాడు. చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే తనకు బోజనం కూడా తినబుద్ది కావడం లేదని చెప్పుకొచ్చారు. అందుకే తన ఇంట్లో వినాయక చవితి వేడుకలను కూడా జరుపుకోలేదని తెలిపారు.
ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని.. ఐటీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి, సొంతూళ్లకు వెళ్లి ధర్నాల్లో పాల్గొనాలని బండ్ల గణేశ్ అన్నారు. హైదరాబాద్ లో పార్కుల ముందు, రోడ్లపై కాకుండా.. సొంతూళ్లకు వెళ్లి ధర్నాలు చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని, చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ వ్యవహారంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆయన అరెస్ట్ అక్రమమంటూ ఇప్పటికే పలు రాజకీయ పార్టీల అధినేతలు విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ అంశం పార్లమెంటులో సైతం ప్రస్తావనకు వచ్చింది.
బండ్ల గణేష్ ప్రస్తుతం రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే పోటీ చేయాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసి ఘోర పరాజయం అయ్యాడు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. సినిమాలే తన లోకమని, ఇక సినిమాలపైనే ఫోకస్ పెడతాను అని, రాజకీయాలు వదిలేశాను అంటూ మాట్లాడుకొచ్చాడు. కానీ, మళ్లీ రాజకీయాల మీద మనసు పడ్డట్టుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్టు, కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగేందుకు ప్లాన్ వేస్తున్నట్టుగా బండ్ల గణేష్ అడుగులు కనిపిస్తున్నాయి. రిసెంట్ గా బండ్ల గణేష్ కేబీఆర్ పార్క్ వద్ద కనిపించాడు. చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నట్టుగా అనిపిస్తోంది. కేబీఆర్ పార్క్ వద్ద బండ్లన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన తారక్.. చంద్రబాబు అరెస్ట్ పై ఏమైనా మాట్లాడతారా..?
Bandla Ganesh: అందుకే వినాయక చవితి కూడా జరుపుకోలేదు..! అసలు కారణం ఏంటో తెలుసా?
చంద్రబాబు అరెస్ట్ పై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు జైల్లో అరెస్టై మగ్గుతుంటే తనకు బోజనం కూడా తినబుద్ది కావడం లేదని చెప్పుకొచ్చారు. అందుకే తాను ఇంట్లో వినాయక చవితి వేడుకలను కూడా జరుపుకోలేదని వాపోయారు.