/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/srikanth-1-jpg.webp)
Shrikanth Iyengar: ఏపీలో లభించే బీరు గురించి మాట్లాడుతూ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్( Shrikanth Iyengar ) ఓ వీడియోను పోస్ట్ చేశారు. 'ఇవాళ బెజవాడలో ఉన్నాను. డిప్రెషన్లో ఉండి బీరు తెచ్చుకున్నా. (బూమ్ బూమ్ బీర్ను చూపిస్తూ) అది మామూలు బీర్ కాదు. ఇంట్లో కూడా చెప్పలేదు.. మీకు చెప్తున్నా. ఇది తాగుతున్నా.. ఏమవుతుందో తెలీదు. నన్ను గుర్తు పెట్టుకోండి' అంటూ వీడియోలో సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల కాలంలో ఈయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా హీరో కార్తికేయ బెదురులంక 2012( Bedurulanka 2012 ) సినిమాలో దొంగ స్వామిగా నటించి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు శ్రీకాంత్ అయ్యంగార్.
దేశంలో ఎక్కడా కనిపించని, వినిపించని మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయి. బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ చాయిస్, స్పెషల్ స్టేటస్.. ఇలా పేర్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పేర్లు వినిపించవు. అయితే ఇవి మీ హయాంలో అంటే మీ హయాంలో తయారైనవే అంటూ అధికార, విపక్షాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. గతంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఏపీలో బూమ్ బూమ్ బీర్లు తాగడం వల్లే అనారోగ్యంతో చనిపోయారంటూ పుకార్లు రేగాయి. దీనిపై సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ మధ్య పెద్ద వార్ కూడా జరిగింది.
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడుపుతోంది. పాత మద్యం పాలసీని రద్దుచేసింది. నేరుగా ప్రభుత్వమే అమ్మకాలు చేపడుతోంది. షాపుల్లో కొత్త కొత్త బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి. ధరలు సైతం భారీగా పెంచారు. ఇదేమని ప్రశ్నిస్తే ధరలను చూసి మందుబాబులు వెనక్కి తగ్గుతారని చెప్పుకొచ్చారు. తాజాగా, శ్రీకాంత్ అయ్యంగార్ వీడియోను పోస్ట్ చేయడంతో మళ్లీ ఏపీలోని బీర్లపై వార్ జరిగిన ఆశ్చర్య పొనక్కర్లేదు. అయితే, తాగిన మైకంలో వీడియో అలా పోస్ట్ చేశారా? లేదంటే వాటెండ్ గానే అలా పెట్టారనేది తెలియాల్సింది.