/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stock-Market-Records-jpg.webp)
Today Stock Market News: మూడురోజుల వరుస సెలవుల అనంతరం.. స్టాక్ మార్కెట్ లో ఈరోజు సోమవారం (జనవరి 29) ట్రేడింగ్ మొదలైంది. ట్రేడింగ్ మొదలు అవుతూనే ఇండెక్స్ లు లాభాల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో 71,200 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 150 పాయింట్లకు పైగా పెరిగింది. 21,500 స్థాయిలో ట్రేడవుతోంది. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో, 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 26 పెరుగుదలను చూపుతున్నాయి.. 4 మాత్రమే క్షీణతను చూపుతున్నాయి.
Today Stock Market News: భారత్ స్టాక్ మార్కెట్ మాత్రమే కాకుండా ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.46 శాతం లాభపడగా, టో పాక్స్ 1 శాతం వరకూ పెరిగింది.మరోవైపు ఎఱ్ఱసముద్రంలో మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తడంతో చమురు ధరలు పెరిగాయి.
Today Stock Market News: ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలో అత్యధికంగా లాభాలు చూస్తున్న కంపెనీలలో కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC), యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), పంజాబ్ నేషనల్ బ్యాంక్, HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఉన్నాయి. . . .
టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, వంటి కంపెనీలు నష్టాలతో ఉన్నాయి.
Also Read :తగ్గినట్లే తగ్గి పెరిగిన బంగారం.. తగ్గేదేలే అంటున్న వెండి!
BLS E-Services Limited - IPO రేపటి నుండి
BLS E-Services Limited యొక్క IPO రేపటి నుండి అంటే జనవరి 30 నుండి తెరవబడుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి 1 వరకు దీని కోసం వేలం వేయవచ్చు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ ₹310.91 కోట్లు సమీకరించాలనుకుంటోంది. కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఫిబ్రవరి 6న లిస్ట్ చేయబడతాయి.
గత వారం మార్కెట్ లో క్షీణత..
జనవరి 25న స్టాక్ మార్కెట్ లో క్షీణత కనిపించింది. సెన్సెక్స్ 359 పాయింట్ల పతనంతో 70,700 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 101 పాయింట్లు పతనమైంది. 21,352 వద్ద ముగిసింది. గత వారం, సెన్సెక్స్ 982.56 పాయింట్లు లేదా 1.37% పడిపోయింది.
Watch this interesting Video: