నేడు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో కొనసాగాయి. నిఫ్టీ ట్రేడింగ్‌లో గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ కూడా 74 పాయింట్లు లాభపడింది. అయితే.. స్టాక్ మార్కెట్ లో ఈరోజు ఇన్వెస్టర్లు దాదాపు రూ.25,000 కోట్ల మేర నష్టపోయారు. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం క్షీణతతో నష్టాల్లోనే కొనసాగుతోంది. సెక్టోరల్ ఇండెక్స్‌లో ఐటీ, ఫార్మా, టెలికాం కంపెనీల సూచీలు మాత్రమే గ్రీన్‌లో ముగిశాయి. మిగతా అన్ని రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది.
పూర్తిగా చదవండి..నేటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
ట్రేడింగ్ ముగిసే సమయానికి, BSE సెన్సెక్స్ 73.80 పాయింట్లు అంటే 0.09 శాతం పెరిగి 81,785.56 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ 50 షేర్ల సూచీ నిఫ్టీ కేవలం 34.60 పాయింట్లు అంటే 0.14 శాతం లాభంతో 25,052.35 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ సరికొత్త గరిష్టాన్ని తాకింది.
Translate this News: