నేడు కార్గిల్ విజయ్ దివస్...నాటి సైనికుల పోరాట స్పూర్తి నేటికీ చిరస్మరణీయం..!! అడ్డదారుల్లో భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ సైనికులకు ...భారత ఆర్మీ తమ పరాక్రమాన్ని రుచి చూపించింది. ఆపరేషన్ విజయ్ తో కార్గిల్ నుంచి పాకిస్తాన్ చొరబాటుదారులపై యుద్ధభేరీ మోగించింది. భారత్ పేరు వింటేనే పాకిస్థాన్ వెన్నులో వణుకు వచ్చేలా చేసింది. By Bhoomi 26 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి నేడు (జూలై 26) దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటారు. కార్గిల్ కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌కు ఉమ్మడి రాజధాని. 1999 మే నెలలో పాకిస్తాన్ సైనికులు, చొరబాటుదారులు కార్గిల్ ద్వారా భారత భూభాగంలోకి చొరబడ్డారు. అక్రమదారిలో భారత భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. దీంతో భారత ఆర్మీ నుంచి..పాక్ సైనికులు తమ పరాక్రమాన్ని రుచి చూడాల్సి వచ్చింది. పాకిస్తాన్ సైనికులపై విరుచుకుపడింది భారత సైన్యం. పాక్ సైనికులను తన్నితరిమికొట్టింది. ఆపరేషన్ విజయ్ తో కార్గిల్ నుంచి పాక్ చొరబాటుదారులపై యుద్ధభేరీ మోగించింది. పాక్ పై యుద్ధం జూలై 26న ముగిసింది. దీంతో 1999 జూలై 26న తొలి కార్గిల్ విజయ్ దివాస్ ను భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. 26 జూలై 1999 కార్గిల్ విజయ్ దివస్‌గా ఎందుకు జరుపుకుంటారు, ప్రతి భారతీయుడు గర్వించదగిన రోజుగా మారిన ఈ రోజు చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. ఇండో పాక్ ఒప్పందం: విభజన తర్వాత రెండు దేశాల మధ్య వివాదం కొనసాగింది. ఫలితంగా 1971లో ఇండో-పాక్ యుద్ధం జరిగింది. అయితే దీని తర్వాత కూడా రెండు దేశాల మధ్య సాయుధ యుద్ధాలు జరిగాయి. కాశ్మీర్‌పై కొనసాగుతున్న వివాదాన్ని తగ్గించేందుకు శాంతియుత పరిష్కారానికి హామీ ఇస్తూ ఫిబ్రవరి 1999లో భారతదేశం, పాకిస్తాన్ సంతకాలు చేశాయి. అయితే నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి పాక్ చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. కార్గిల్ యుద్ధ చరిత్ర: భారత్, పాకిస్తాన్ సైన్యాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా 1999లో కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోని కార్గిల్ ఎత్తైన శిఖరాలను స్వాధీనం చేసుకుంది, దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం "ఆపరేషన్ విజయ్" నిర్వహించింది. 60 రోజుల కార్గిల్ యుద్ధంలో: భారత వీర సైనికులు పాకిస్థానీ చొరబాటుదారులను వెంబడిస్తూ టైగర్ హిల్, ఇతర అవుట్‌పోస్టులను స్వాధీనం చేసుకున్నారు. లడఖ్‌లోని కార్గిల్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఈ యుద్ధం 60 రోజులకు పైగా కొనసాగింది. 2 లక్షల మంది భారత సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. భారత సైన్యం కార్గిల్ శౌర్య గాథ: సైన్యం మిషన్ విజయవంతం కావడానికి, చాలా మంది సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేసారు, వారిలో ఒకరు కెప్టెన్ విక్రమ్ బాత్రా. 26 జూలై 1999న భారత సైన్యం యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించింది. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యానికి చెందిన 527 మంది సైనికులతో పాటు 357 మంది పాకిస్థాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి