Eluru: నష్టపోయిన పొగాకు రైతుల రుణాలు మాఫీ చేయాలి.!

ఏలూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎండిన పొగాకు మొక్కలతో రైతులు నిరసన చేపట్టారు. నష్టపోయిన పొగాకు రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని ఆదుకోకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.

New Update
Eluru: నష్టపోయిన పొగాకు రైతుల రుణాలు మాఫీ చేయాలి.!

Eluru: మిచౌంగ్ తుఫానుతో నష్టపోయిన పొగాకు రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ బృందం జీలుగుమిల్లి మండలంలోని స్వర్ణ గూడెం, పాముల గూడెం, ములగలంపల్లి తదితర గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న పొగాకు తోటలను పరిశీలించారు. ఎండిన పొగాకు మొక్కలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.

Also Read: అమలాపురంలో అంగన్వాడీల ఆందోళన.!

ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. మిచౌంగ్ తుఫాను వల్ల పొగాకు తోటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది వడగళ్ల వానతో ఇదే ప్రాంతంలో రైతులు నష్టపోయారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేలకోట్లు ఆదాయం తెచ్చిపెడుతున్న పొగాకు రైతులు ప్రకృతి వైపరీత్యాలు వలన నష్టపోతున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు.

Also Read: రాజీనామాలపై అలర్ట్ అయిన వైసీపీ..దేవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్టేనా?

పొగాకు బోర్డు అధికారులు, చైర్మన్ తూతూ మంత్రంగా పర్యటనలు చేస్తున్నారే తప్ప ఆచరణలో రైతులను ఆదుకునే పరిస్థితి లేదని విమర్శించారు. వడగళ్ల వాన వలన నష్టపోయిన పొగాకు రైతులకు ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, పొగాకు బోర్డు అధికారులు పొగాకు రైతులను ఆదుకోకపోవడం అన్యాయమన్నారు. తుపాను వలన పొగాకు పంట నష్టాలను వెంటనే నమోదు చేసి పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట రుణాలు మాఫీ చేసి తిరిగి పంట వేసుకునేలా రుణాలు ఇవ్వాలని కోరారు. పొగాకు రైతులను ఆదుకోకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు