AP Assembly: మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రశ్రోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. అయితే, చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై చర్చకు టీడీపీ పట్టుబడుతోంది. ఇదే అంశంపై 2వ రోజు వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి.

New Update
Telangana:నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు

Andhra Pradesh Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రశ్రోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. అయితే, సభ తొలి రోజు నుంచే చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై చర్చకు పట్టుబడుతోన్న టీడీపీ.. ఇవాళ కూడా అదే పట్టుదలతో సభలోకి రానుంది. ఇదే అంశంపై నిన్న వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు.. 2వ రోజు కూడా వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. నిన్న సభ మొత్తం టీడీపీ నేతల ఆందోళనలతో దద్దరిల్లింది. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం, మంత్రులు, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగడం, కొందరు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం.. వంటి చర్యలతో మొదటి రోజు ముగిసిపోయింది.

ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం..

అయితే, అసెంబ్లీ 2వ రోజు సమావేశాల్లోనూ ఆందోళనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు పై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. అలాగే, స్కిల్ డెవలప్మెంట్ స్కాం చర్చలో తమకూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరనున్నారు.

Also Read:

Andhra Pradesh: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు.. ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..

Telangana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు.. మరో పది రోజుల్లో పంపిణీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు