Minister Roja sensational comments on pawan kalyan and chandrababu: నందమూరి ఫ్యామిలీ(Nandamoori) చేతిలోకి వెళ్లకుండా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పక్కా ప్లాన్ రచించారంటూ మంత్రి రోజా(Minister roja) సంచలన ఆరోపణలు చేశారు. బాలకృష్ణను సైడ్ చేసేందుకే జనసేన అధినేత పవన్‌ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. చంద్రబాబునాయుడు, పవన్‌పై రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు(chandrababu) , పవన్(Pawan) ములాఖత్‌లో కుట్ర కోణం ఉందన్నారు రోజా. చంద్రబాబు, పవన్ ఒక్కటేనని.. ముందు నుంచి చెబుతున్నామన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే చంద్రబాబు దోచుకున్నారన్నారు. సీఎంకు తెలియకుండా నిర్ణయాలు జరుగుతాయా అని ప్రశ్నించారు. సీఐడీ దగ్గరకు వెళ్లి సంతకాలను బాబు చూసుకోవాలని.. లోకేశ్(lokesh) కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు రోజా.
మంత్రి రోజా ఇంకేం అన్నారంటే?
⁍ పక్కోడి కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్...
⁍ జైల్లో ఉన్న ఖైదీతో పొత్తు పెట్టుకున్నాడు.
⁍ ఒక దొంగ కోసం పోరాటం చేస్తున్నాడు...
⁍ పుష్కరాల్లో ప్రజలు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు.
⁍ ముద్రగడకు ఎందుకు అండగా నిలబడలేదు...
⁍ ప్యాకేజ్ కోసమే ఇదంతా చేస్తున్నాడు.
⁍ సిగ్గు లేకుండా బానిస బతుకు బతుకుతున్నాడు.
⁍ జన సైనికులు కాదు జెండాలు మోసే కూలీలు.
⁍ సపోర్ట్ చేసే వారందరికీ స్కిల్ స్కాంలో వాటాలు ఉన్నాయి.
⁍ చంద్రబాబు నాయుడు సంతకాలు లేవని అవగాహన లేకుండా అంటున్నాడు...
⁍ సీఐడీ చెప్పిన విషయాలు పవన్‌కు తెలియడం లేదా...?
⁍ అమిత్ షా, మోదీతో మాట్లాడి చంద్రబాబును విడిపించవచ్చు కదా...?
⁍ ఇందులో కక్ష సాధింపు లేదు.
⁍ సినిమాలో మాత్రమే పవన్ హీరో... రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్‌లా మారాడు.
సినీ పరిశ్రమలో నువ్వు(పవన్) ఉండడం సిగ్గు చేటు. కళాకారులుగా మాకు అవమానం.
⁍ పందులు గుంపులుగా వస్తాయని... ఇవాళే పవన్ కళ్యాణ్ అంగీకరించాడు.
ALSO READ: యుద్ధానికి రెడీ.. ఇప్పటి నుంచి ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క అంటున్న టీడీపీ-జనసేన
పొత్తు ఫిక్స్?
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇవాళ(సెప్టెంబర్ 14) జైల్ ములఖాత్‌లో భాగంగా పవన్, బాలకృష్ణ, లోకేశ్ చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే వెళ్తామని తేల్చి చెప్పారు. బీజేపీ తమతో కలిసి రావాలా లేదా అన్నది ఆ పార్టీ ఇష్టమన్నారు. ప్రస్తుతం బీజేపీ-జనసేన పొత్తులో ఉండగా.. టీడీపీతో కలిసి వెళ్తామని పవన్ చెప్పడం ఆసక్తిని రేపుతోంది. 2014 రిపీట్ అవ్వాలని పవన్ కోరుతుండగా.. బీజేపీ నుంచి ఇప్పటివరుకు ఎలాంటి సానుకూల రియాక్షన్ రాలేదు. పైగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏపీ బీజేపీ సైతం మౌనం వహిస్తూ వస్తోంది.
ALSO READ: బేబీ సినిమాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ తీవ్ర ఆగ్రహం