పెను సవాల్‌గా మారిన స్పార్క్ సెర్చ్‌ ఆపరేషన్‌..!

టైటానిక్‌ శిథిలాలను చూసేందుకు వెళ్లి అట్లాంటిక్ సముద్రంలో గల్లంతయిన ఓషన్‌ గేట్‌‌ సబ్‌మెరైన్‌ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సముద్రం అడుగు భాగంలో శబ్ధాలను గుర్తించినట్లు సెర్చ్‌ ఆపరేషన్ టీమ్స్ తెలిపాయి. ఐతే సబ్‌మెరైన్‌లో ఆక్సిజన్‌ మరో 20 గంటలకు సరిపడా మాత్రమే ఉండడంతో మరింత ఆందోళన నెలకొంది. ఇది సెర్చ్‌ ఆపరేషన్‌ బృందాలకు పెను సవాల్‌గా మారింది. సబ్‌మెరైన్‌లోని ఆక్సిజన్ అయిపోయేలోగా దాన్ని గుర్తించాల్సి ఉంది.

New Update
పెను సవాల్‌గా మారిన స్పార్క్ సెర్చ్‌ ఆపరేషన్‌..!

ఉత్తర అట్లాంటిక్‌లోని 7 వేల 600 చదరపు మైళ్ల ప్రాంతాన్ని..రెండు మైళ్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్లి సెర్చ్‌ చేయడం చాలా కష్టమంటున్నారు నిపుణులు. ఆ లోతులో సముద్రం..కళ్ల ముందు అరచేయిని కూడా చూడలేనంత నల్లగా ఉంటుందని..పూర్తిగా బురదమయంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఆ లోతులో గడ్డకట్టుకుపోయేంత చలి కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ దాదాపు ఓ వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లినంత కష్టమన్నారు.

టైటానిక్ శిథిలాను చూసేందుకు బయల్దేరిన ముగ్గురు ప్రయాణికులు

టైటాన్‌ అనే 6.5 మీటర్ల సబ్‌మెరైన్‌..అట్లాంటిక్‌ సముద్రంలో టైటానిక్ శిథిలాను చూసేందుకు ఆదివారం ముగ్గురు ప్రయాణికులతో బయల్దేరింది. ఇందులో బ్రిటిష్ బిలియనీర్‌ హమీష్ హార్డింగ్‌తో పాటు పాకిస్థాని బిజినెస్‌మెన్‌ షాజాదా దావూద్‌, అతని కొడుకు సులేమాన్ ఉన్నారు. ఈ ట్రిప్పు కోసం ఒక్కొక్కరి నుంచి ఒసియన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్‌ దాదాపు 2 లక్షల 50 వేల డాలర్లు వసూలు చేసింది. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు 2 కోట్లతో సమానం. ఇక ఈ సబ్‌మెరైన్‌లో కంపెనీ సీఈవో స్టాక్టన్‌తో పాటు ఫ్రెంచ్ సబ్‌మెరైన్ ఆపరేటన్‌ పాల్ హెన్రీ నార్జియోలెట్‌ కూడా ఉన్నారు.

సబ్‌మెరైన్ సెర్చ్ ఆపరేషన్‌ పెద్ద టాస్క్‌

ఐతే సబ్‌మెరైన్ సెర్చ్ ఆపరేషన్‌ ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. సముద్రం అట్టడుగున సెర్చ్ చేసేందుకు అవసరమైన పరికరాలు, సదుపాయాలు లేవన్నారు యూఎస్ కోస్ట్‌గార్డ్‌ కెప్టెన్‌ జేమి ఫ్రెడరిక్‌. కోస్ట్‌గార్డ్‌లు సాధారణంగా చేసే సెర్చ్ ఆపరేషన్‌ల కంటే ఇది చాలా కఠినమైనదని చెప్పారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌ కోసం సబ్జెక్ట్‌ నైపుణ్యంతో పాటు అనేక సంస్థల సహకారం అవసరమన్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్‌లో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఉపరితలంతో పాటు సముద్రం అంతర్భాగంలోనూ సోనార్‌లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు సెర్చ్ ఆపరేషన్‌లో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు.

న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ కేవలం 300 మీటర్ల వరకే పనిచేస్తాయి

1985లో టైటానిక్ శిథిలాలను కనుగొనడానికి ఉపయోగించిన ఆప్టికల్ ఇమేజింగ్‌ సిస్టమ్‌ను డెవలప్ చేసిన బృందంలోని జూల్స్‌ జాఫ్‌..మూడు వేర్వేరు ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక వేళ సబ్‌మెరైన్ సముద్రపు అడుగుభాగంలోకి వెళ్లి ఉంటే దానిని గుర్తించడం చాలా కష్టమంటున్నారు. సముద్రంలో నాలుగు కిలోమీటర్ల లోపల ఉపరితలం కంటే నాలుగు వంద రెట్లు ఒత్తిడి ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఇది సబ్‌మెరైన్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని..అలాంటి పరిస్థితుల్లో కొన్ని సబ్‌మెరైన్‌లు మాత్రమే తట్టుకోగలవని చెప్తున్నారు. న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ కేవలం 300 మీటర్ల వరకే పని చేయగలవని నిపుణులు చెప్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు