Titanic Biscuit : ఈ ఒక్క బిస్కట్ రేటెంతో తెలిస్తే నోరెళ్లబెడతారు! దీని స్పెషాలిటీ వింటే అదిరిపోతారు!! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిస్కెట్ గా ఓ బిస్కట్ నిలిచింది. టైటానిక్ షిప్ తో సంబంధం ఉన్న ఈ బిస్కెట్ ను బ్రిటన్ లో వేలం వేయగా 26 లక్షల రూపాయలకు పైగా బిడ్ చేసి ఒక ఔత్సాహికుడు దక్కించుకున్నాడు. ఆ బిస్కట్ క్రేజ్ అలా ఉంది మరి.. టైటానిక్ షిప్ నాటి బిస్కట్ కదా! By KVD Varma 17 Jun 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Titanic Biscuit Price : మిమ్మల్ని ఒక బిస్కెట్ రేట్ (Biscuit Rate) ఎంత ఉంటుంది అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు. బాగా ఖరీదైనది కొనాలంటే ఓ రెండు మూడొందల ఉండొచ్చు అంటారు. అదే విదేశాల్లో వెయ్యి నుంచి ఐదువేలు ధర ఉన్న బిస్కెట్లు కూడా ఉన్నాయని మీకు తెలిస్తే అదే సమాధానం చెబుతారు. కానీ.. లక్షల్లో ఉండే బిస్కెట్ గురించి మీకు తెలుసా? అసలు ఒకే ఒక బిస్కెట్ కి లక్షల రూపాయలు ఎందుకు అనే డౌట్ పక్కన పెడితే.. ఇప్పుడు మీకు చెప్పబోతున్న ఈ బిస్కెట్ ధరతో ఓ లగ్జరీ కారు కొనొచ్చు. లేదా 20 ఎంఆర్ఎఫ్ షేర్ల (MRF Shares) ను కొనుక్కోవచ్చు అంటే నమ్ముతారా? నమ్మాలి తప్పదు. అన్నట్టు ఈ బిస్కెట్ కి టైటానిక్ షిప్ కి చాలా సంబంధము ఉంది. అబ్బా.. విషయం చెప్పండి అంటారా.. అక్కడికే వస్తున్నాం.. బిస్కెట్లో బంగారం పెట్టారా? Titanic Biscuit : ఇప్పుడు మీకు ఓ పెద్ద అనుమానం వచ్చి ఉంటుంది. లక్షల ఖరీదు చేసే బిస్కెట్ అంటే బంగారం బిస్కెట్ అని అనిపించవచ్చు. ఈ బిస్కెట్ తయారీలో చాలా విలువైన వస్తువులు ఉపయోగించారని మీరు అనుకుంటే, మీరు తప్పుగా భావిస్తారు. సాధారణ బిస్కెట్ల మాదిరిగానే, ఈ బిస్కెట్ కూడా పిండి, నీరు - పంచదార కలిపిన ద్రావణంతో తయారుఅవుతుంది. ఈ బిస్కెట్ సైజు గురించి చెప్పాలంటే, ఈ ప్యాకెట్‌లో ఉన్న ఒక్కో బిస్కెట్ పరిమాణం 10 సెం.మీ. ఈ బిస్కెట్ సాధారణ బిస్కెట్ లాగానే కనిపిస్తుంది. అయితే ఈ బిస్కెట్ ఇంత ధర పలకడానికి కారణం ఏమిటంటే అది టైటానిక్ షిప్ (Titanic Ship) తో దీనికి గల అనుబంధం. టైటానిక్‌కి బిస్కట్ కీ లింక్ ఏమిటి? ఈ బిస్కెట్ ప్యాకెట్ టైటానిక్ లైఫ్ బోట్‌లో ఉంచిన సర్వైవల్ కిట్‌లో ఉంది. టైటానిక్ మునిగిపోయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దానికి సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరిగింది. చాలామంది దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గుర్తుగా ఉంచుకోవాలన్నారు. ఈ బిస్కెట్ జేమ్స్ ఫెన్విక్ అనే వ్యక్తి వద్ద ఉంది. టైటానిక్ మునిగిపోఏ సమయంలో ఈ ఫెన్విక్ కి చెందిన షిప్ కూడా సముద్రంలో ఉంది. అతనికి టైటానిక్ మునిగిపోయిన వార్త అందింది. దీంతో అతని షిప్ ను టైటానిక్ సహాయక పనిలో మోహరించారు. అక్కడ ఫెన్విక్‌కి ఈ బిస్కెట్ దొరికింది. దానిని జ్ఞాపకంగా ఉంచుకున్నాడు. ఓడ మునిగిన కొన్నాళ్ల తర్వాత ఈ బిస్కెట్‌ను వేలం వేయాలని భావించారు. దాని ధర లక్షల రూపాయలు పలుకుతుందని అంచనా వేశారు. వేలం వేశారు.. అంచనాలను మించి.. ఇటీవల, ఈ బిస్కెట్‌ను వేలం వేయగా, ఒక కొనుగోలుదారు దాని కోసం 31,800 డాలర్లు బీడ్ వేశారు. ఇది భారతీయ రూపాయలలో సుమారుగా రూ. 26 లక్షల 56వేల రూపాయలు. ఈ వేలం బ్రిటన్‌లో జరిగింది. ముందుగా ఈ బిస్కెట్ ధర గరిష్టంగా 21000 డాలర్లకు చేరవచ్చని వేలం నిర్వాహకులు భావించారు. కానీ ఈ బిస్కెట్ వేలానికి వచ్చినప్పుడు, చాలా మంది దానిని కొనడానికి పోటీ పడ్డారు. ఈ బిస్కెట్ కోసం చివరి బిడ్డింగ్ 31,800 US డాలర్ల వద్ద నిలిచింది. దీంతో ఆ వ్యక్తికీ ఈ బిస్కెట్ దక్కింది. అంటే ఒక్క బిస్కెట్ 26 లక్షల రూపాయలకు పైగా ధర పలికింది అన్నమాట. ఈ బిస్కెట్ తినడానికి పనికి వచ్చేది కూడా కాదు. కేవలం టైటానిక్ షిప్ గుర్తుగా దీనిని ఇంటిలో దాచుకోవడం కోసం అంత ధర పెట్టారు. మొత్తమ్మీద ఈ టైటానిక్ షిప్ ఇప్పటికీ ప్రజల్లో వార్తగా నిలుస్తూనే ఉండడమే అసలు విశేషం. Also Read : ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఈరోజు.. పనులు పరుగులు పెడతాయా? #biscuit #titanic #mrf-shares మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి