తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదని పేర్కొన్నారు. ఈ పదవి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి కృప, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతోనే తనకు ఈ అవకాశం దక్కిందని చెప్పారు. గతంలో ఏ విధంగా పని చేశామో.. అంతకు మించిన విధంగా సామాన్య భక్తుల కోసం పని చేస్తామని భూమాన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
రెండోసారి వేంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తమ అధినేత జగన్ ఇచ్చిన ఈ అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంటానన్నారు. గతంలో లాగా హిందు ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. 15 సంవత్సరాల తరువాత తనకు మళ్లీ టీటీడీ ఛైర్మన్ పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.
జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హాయంలో చైర్మన్ గా పనిచేశానని, ఇప్పుడు తనయుడు హాయంలో చైర్మన్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇది కూడా వెంకన్న ఆశీస్సులతో లభించిందని భావిస్తున్నానని చెప్పారు. తండ్రి దగ్గర, కొడుకు దగ్గర పనిచేసే అవకాశం.. బహుశా ఇంకెవరికీ రాకపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
కాగా ప్రస్తుత టీటీడీ పాలక మండలి గడువు ఆగష్టు 8వ తేదీ ముగుస్తున్నందున, కొత్త పాలక మండలిని నియమించాల్సి ఉందని పేర్కొంటూ తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ గా ఆయన నియామకం తర్వాత సభ్యుల నియామకం కూడా చేపడతామని ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆగష్టు 8న ప్రస్తుత బోర్డు పదవీకాలం ముగిసిన అనంతరం కొత్త పాలకమండలి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నియామకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే వాస్తవానికి రెండేళ్ల క్రితమే టీటీడీకి కొత్త చైర్మన్ ని నియమించాల్సి ఉందిది. కానీ వైవీ సుబ్బారెడ్డికే రెండో సారి చైర్మన్ గా అవకాశం కల్పించారు సీఎం జగన్. టీటీడీ చైర్మన్ రేసులో ఈసారి కూడా చాలా పేర్లు వినిపించాయి. అయితే ముఖ్యమంత్రి మాత్రం కరుణాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలు ఆయన హయాంలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదు: ఎమ్మెల్యే భూమన
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదని పేర్కొన్నారు. ఈ పదవి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి కృప, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతోనే తనకు ఈ అవకాశం దక్కిందని చెప్పారు. గతంలో ఏ విధంగా పని చేశామో..
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదని పేర్కొన్నారు. ఈ పదవి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి కృప, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతోనే తనకు ఈ అవకాశం దక్కిందని చెప్పారు. గతంలో ఏ విధంగా పని చేశామో.. అంతకు మించిన విధంగా సామాన్య భక్తుల కోసం పని చేస్తామని భూమాన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
రెండోసారి వేంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తమ అధినేత జగన్ ఇచ్చిన ఈ అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంటానన్నారు. గతంలో లాగా హిందు ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. 15 సంవత్సరాల తరువాత తనకు మళ్లీ టీటీడీ ఛైర్మన్ పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.
జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హాయంలో చైర్మన్ గా పనిచేశానని, ఇప్పుడు తనయుడు హాయంలో చైర్మన్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇది కూడా వెంకన్న ఆశీస్సులతో లభించిందని భావిస్తున్నానని చెప్పారు. తండ్రి దగ్గర, కొడుకు దగ్గర పనిచేసే అవకాశం.. బహుశా ఇంకెవరికీ రాకపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
కాగా ప్రస్తుత టీటీడీ పాలక మండలి గడువు ఆగష్టు 8వ తేదీ ముగుస్తున్నందున, కొత్త పాలక మండలిని నియమించాల్సి ఉందని పేర్కొంటూ తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ గా ఆయన నియామకం తర్వాత సభ్యుల నియామకం కూడా చేపడతామని ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆగష్టు 8న ప్రస్తుత బోర్డు పదవీకాలం ముగిసిన అనంతరం కొత్త పాలకమండలి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నియామకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే వాస్తవానికి రెండేళ్ల క్రితమే టీటీడీకి కొత్త చైర్మన్ ని నియమించాల్సి ఉందిది. కానీ వైవీ సుబ్బారెడ్డికే రెండో సారి చైర్మన్ గా అవకాశం కల్పించారు సీఎం జగన్. టీటీడీ చైర్మన్ రేసులో ఈసారి కూడా చాలా పేర్లు వినిపించాయి. అయితే ముఖ్యమంత్రి మాత్రం కరుణాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలు ఆయన హయాంలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Andhra Pradesh: యూట్యూబ్ చూసి 16 బుల్లెట్ బైక్‌లు చోరి.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్టు
బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు ఆకతాయిలు యూట్యూట్‌లో బుల్లెట్ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
నాలిక చీరేస్తా.. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్-VIDEO
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షల సాయం.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!
ఈ క్రమంలో పాఠశాలలో ఉన్న పరిసరాలు అన్నింటిని పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. Short News | Latest News In Telugu | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | రాజకీయాలు | నెల్లూరు
Kadapa Girl Murder: ఏపీలో దారుణం.. ముళ్లపొదల్లో బట్టలు లేకుండా బీటెక్ యువతి శవం
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జమ్మలమడుగు సమీపంలోని గండికోట రిజర్వాయర్ వద్ద ప్రొద్దుటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతదేహం.. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం