జనసేన నాయకులకు పోలీసులకు కొంత తోపులాట జరిగింది. జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న జనసేన నాయకులను పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కోట వినుతను టూ టౌన్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కాళహస్తిలో ప్రస్తుతం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
సీఐ అంజుయాదవ్ మరోసారి చెంప చెల్లుమనిపించారు. ఈసారి జనసైనికుల చెంప చెల్లుమనిపించారు. గతంలోనూ టీడీపీ కార్యకర్తల చెంప చెల్లుమనిపించారు. అర్ధరాత్రి హోటల్ నడుపుకుంటున్న ఒక మహిళ చెంపను వాయకొట్టారు అంతేకాదు ఆ మహిళను తన పోలీస్ వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పరిస్థితి. ఇలా వరుస ఘటనలో ఆమె చెంప చెల్లుమనిపించడంతో పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. అంతేకాదు వైఖరిని నిరసిస్తూ పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసైనికులు, వైసీపీ కార్యకర్తల మద్య వాగ్వాదం నడుస్తోంది. అంతేకాదు ఇరుపార్టీల నేతలు సైతం వారి వారి నాయకులను విమర్శించినందుకు గానూ అటు పవన్ కళ్యాణ్, ఇటు సీఎం జగన్ దిష్టి బొమ్మలను తగలబెట్టడానికి యత్నించగా సీఐ అంజు యాదవ్ అక్కడికి చేరుకున్నారు. అయితే మరోసారి జనసైనికుల చెంప చెల్లుమనిపించారు. గతంలోనూ చాలా వివాదాల్లో ఇరుక్కున్న సీఐని సస్పెండ్ చేయాలని పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే మళ్లీ ఎదుర్కోవడంతో తీవ్రస్థాయిలో దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.