తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొద్ది రోజుల క్రితం టీటీడీలోని కొన్ని పోస్టుల (Jobs) ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ (Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 56 ఇంజినీర్ల పోస్టుల భర్తీ కి నియామకాలు చేపట్టనుంది. ఇందులో ఏఈఈ, ఏఈ, ఏటీవో తదితర పోస్టులున్నాయి.
ఈ పోస్టులకు అర్హత ఉన్నవారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ తెలిపింది. ఈ ఉద్యోగాలకు కేవలం హిందూవులు మాత్రమే అర్హులని టీటీడీ ముందుగానే ప్రకటించింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు నవంబర్ 23 లాస్ట్ డేట్. అంటే ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది.
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఇందులో మొత్తం 56 పోస్టులు ఉండగా..వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) - 27 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 10 పోస్టులు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ - 19 పోస్టులు ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్‌సీఈ/ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు 42 సంవత్సరాల వయసు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఏఈఈకి రూ. 57,100-రూ. 1,47,760 లు ఉండగా..ఏఈకి రూ.48,440-రూ. 1,37,220 లుగా ఉంది.
ఏటీవో పోస్టులకు రూ. 37,640- రూ. 1,15,500 వరకు ఇస్తారు పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ttd-recruitment.aptonline.in/ పై క్లిక్ చేయండి.
Also read: ఎంగ్జైటీని లైట్ తీసుకోవద్దు.. కారణం ఇదే!