తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశమనే చెప్పవచ్చు. మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనుంది. ఏఈఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూ మతానికి చెందిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని అధికారులు వెల్లడించారు.ఇంజనీరింగ్ పూర్తి చేసి 42 సంవత్సరాల వయసు మించని వారు వెంటనే ఈ ఉద్యోగాలకు ఆప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా నవంబర్ 23 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Also read: ఏపీ మంత్రి అంబటికి తప్పిన ప్రమాదం!
టీటీడీ అధికారులు విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) కి సంబంధించి 27 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) కి సంబంధించి 10 పోస్టులు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) కి సంబంధించి మొత్తం 19 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగాలకు అర్హత బీఈ, బీటెక్ లో (సివిల్, మెకానికల్, ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్ ) చేసిన వారు ఈ ఉద్యోగాలకు ఆప్లై చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏఈఈ పోస్టులకు నెలకు రూ. 57, 100 నుంచి రూ. 1,47,760 వరకు ఉంటుంది.
ఏఈ పోస్టులకి రూ. 48, 440 నుంచి రూ. 1,37,220 వరకు ఉంటుంది. అలాగే ఏటీవో పోస్టులకు సంబంధించి నెలకు రూ. 37, 640 నుంచి రూ. 1,15, 500 వరకు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆప్లికేషన్లకు చివరి తేదీ నవంబర్ 23, 2023. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://www.tirumala.org/ ను సందర్శించండి.
Also read: ఉల్లి ధరలు సెంచరీ కొడతాయా? ఒక్కసారిగా డబుల్ అయిన ధరలు..!!