Tirumala Brahmotsavam : సింహ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామి వారు!

కలియుగ ప్రత్యక్ష దైవం..అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల (tirumala) వెంకటేశ్వర స్వామి (venkateswara swami) వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సింహ వాహన(Simha Vahana seva) సేవ నిర్వహించారు.

Tirumala Brahmotsavam : సింహ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామి వారు!
New Update

Tirumala Brahmotsavam: కలియుగ ప్రత్యక్ష దైవం..అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ తిరుమల (Tirumala) వెంకటేశ్వర స్వామి (Venkateswara swami) వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సింహ వాహన(Simha Vahana seva) సేవ నిర్వహించారు. సింహ వాహనం పై స్వామి వారిని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. నేటి రాత్రికి స్వామి వారికి ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహించనున్నారు.

ఈ వాహన సేవలో తిరుమల పెద్ద‌జీయ‌ర్‌స్వామి, చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవో (TTD EO), అధికారులు పాల్గొన్నారు.సింహ వాహన సేవకు ప్రత్యేక విశిష్టత ఉంది. సింహం అడవికి మృగరాజు. మృగరాజు అన్ని జంతువులను హింసించడు..కేవలం తన శాసనాలను ఎదిరించిన వాటికి మాత్రమే శిక్ష విధిస్తాడు. ''సత్యం వధ ధర్మం చరా'' అంటే భగవంతుని శాసనాన్ని ఉల్లంఘించే వారిని భగవంతుడు హింసిస్తాడు. ఆ విధంగానే నరసింహ స్వామి అవతారం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

Also read: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త..భారీగా తగ్గిన ధరలు!

ఉగ్ర నరసింహుడు అవతారం సమయంలో తన రూపాన్ని ఉపయోగించుకున్నందకు గానూ..జగత్‌ కళ్యాణాన్ని చేసినందుకు కానూ స్వామి వారికి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని మృగరాజు స్వామి వారిని వేడుకోగా ఆయనకు వాహనంగా మలచుకున్నాడు ఆ శ్రీనివాసుడు.
బలమును కొలిచేటపుడు బలవంతులను సింహబలుడు అని అంటారు. అంటే బలమునకు పరాకాష్ట సింహం. సింహం పరాక్రమము, శౌర్యము ప్రస్ఫుటంగా కనబడతాయి. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసేవాడు నరసింహుడు.

సింహ వాహనం పై ఊరేగుతున్న మలయప్ప స్వామిని దర్శించుకున్న వారికి ధర్మం పట్ల దీక్ష, అధర్మాన్ని నిర్మూలించగల క్రౌర్యం ప్రాప్తిస్తాయని సంకేతం.

అధర్మంగా ప్రవర్తించే వారిని అంతం చేయడం, అన్యాయాన్ని నామా రూపాలు లేకుండా చేయడమే దైవ స్వభావం. అందుకే సింహం, పెద్ద పులి వంటి దైవానికి వాహనాలుగా పూజించడం జరుగుతుంది. మృగములైనా అవి దైవాంశ గలవే, ఆరాధించ దగినవే అని సింహ వాహన ఉపదేశం.

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ మలయప్ప స్వామి వారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనం పై తిరుమాడ విహరించారు. భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి వారి ఊరేగింపు ముందు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు, కళా బృందాలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

Also Read: అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తున్న బెజవాడ దుర్గమ్మ!

#tirumala-brahmotsavam-2023-dates #tirumala
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి