Best Smart Work Tips For Employees: కొన్ని మంచి అలవాట్లను పాటించడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పనిని కంప్లీట్ చేయవచ్చు. టైమ్ సేవ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్(Smart Work Tips) ఉపయోగించాలి. చేయాల్సిన పనులలో ఏవి ముఖ్యమో గుర్తించి, వాటిపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. స్మార్ట్ వర్కర్‌గా మారడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
టు-డు లిస్ట్
రోజూ చేయాల్సిన పనులను లిస్ట్ చేయాలి. దీంట్లో ముందుగా కొంచెం కష్టంగా అనిపించేవి, కానీ చాలా ముఖ్యమైనవి రాసుకోవాలి. అంటే, త్వరగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులను ముందుగా కంప్లీట్ చేసి, తర్వాత మిగతా పనులు చేయాలి.
టైమ్ లిమిట్
ఒక పనిని పూర్తి చేయడానికి నిర్దిష్ట టైమ్ లిమిట్ సెట్ చేసుకోవాలి. డెడ్‌లైన్ సెట్ చేసుకుంటే మనం పనిని వేగంగా పూర్తి చేయగలం. ఒక పని త్వరగా పూర్తి చేస్తే మిగతా పనులకు కూడా సమయం మిగులుతుంది. పని ముగించి ఇంటికి వెళ్లే ముందు వర్క్ ప్లేసు అల్లకల్లోలంగా మారకుండా జాగ్రత్త పడొచ్చు.
డిస్ట్రాక్షన్ వద్దు
పని చేసే చోట డిస్ట్రాక్షన్స్ కలగకుండా చూసుకోవాలి. అవసరంలేని ఫోన్ నోటిఫికేషన్లను ఆఫ్ చేసుకోవాలి, డిస్టర్బ్ చేయకూడదని పక్కన వారికి చెప్పాలి లేదా నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ వాడాలి
కమ్యూనికేషన్స్ స్కిల్స్
ఇతరులతో కలిసి పని చేసేటప్పుడు, అన్ని విషయాలను వారికి కమ్యూనికేట్ చేయాలి. ఇతరుల మాటలను పూర్తిగా అర్థం చేసుకొని రిప్లై ఇవ్వాలి. బాస్, కొలీగ్ మెయిల్ చేస్తే, వెంటనే రిప్లై ఇవ్వడం మంచిది. మాట్లాడేటప్పుడు ఒకే విషయం మీద దృష్టి పెట్టి మాట్లాడాలి. ఇతరులు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినాలి.
ఒక్క పని మీదే ఫోకస్
ఒకేసారి అనేక పనులు చేయకుండా, ఒకే పనిపై దృష్టి పెట్టాలి. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వేరే పని చేయకూడదు. కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఒకే పనిపై దృష్టి పెడితే పని నాణ్యత పెరుగుతుంది. ఒకేసారి అనేక పనులు చేస్తే ఒత్తిడి రెట్టింపవుతుంది.
బ్రేక్స్
కంటిన్యూగా వర్క్ చేయకూడదు. కొంత సమయం పాటు పనిచేశాక ఓ చిన్న బ్రేక్ తీసుకోవాలి. ముఖ్యంగా పోమోడోరో టెక్నిక్ ఫాలో కావాలి. అంటే 25 నిమిషాలు పని చేసి, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే పనిపై ఎక్కువగా దృష్టి పెట్టగలం.
Also Read: ఢిల్లీలో వరదలు..ముగ్గురు విద్యార్ధులు మృతి
పని విధానాన్ని మెరుగుపర్చుకోవడం
చేసే పనిని ఎలా చేస్తున్నామో తరచుగా గమనిస్తుండాలి. అంటే, ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఎక్కడ మరింత బాగా చేయవచ్చు అని ఆలోచించాలి. కలిసి పని చేసే వారిని అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కూడా మంచిది. ఈ టిప్‌తో స్మార్ట్‌గా వర్క్ చేయవచ్చు.