చలి కాలంలో చాలా మంది అనారోగ్యానికి గురవుతారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు జలుబు, జ్వరం, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వయసులో పెద్దరికి కూడా చలికాలంలో శ్వాస సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఇలా ఉండగా చలికాలంలో కూడా ఫిట్ గా ఉండాలంటే కొన్న పనులు చేయాలి. అవేంటో చూద్దాం..
వ్యాయామం చేయడం:
ప్రతిరోజు వ్యాయాయం చేయడం ద్వారా మన శరీరం ఫిట్ గా ఉంటుంది. దీనికి కాలంతో సంభందం ఉండదు ఏ కాలంలోనైనా వ్యాయామం చేస్తే శరీరం స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే చలి కాలంలో చాలా మంది వ్యాయామం చేయడానికి ఇష్టపడరు. ఉదయం లేవడానికి బద్దకిస్తారు. వ్యాయామమే కాదు ఏ పని చేయాలన్న పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు. దీని వల్ల బద్ధకం ఎక్కివగా పెరిగిపోతోంది. ఎలాంటి పనులు చేయకపోవడం మనం బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
11 నిమిషాలు నడవండి:
రోజు కొద్దీ సమయం నడవడం లేదా జాగింగ్ చేయడం ద్వారా మన శరీరంలో రక్త ప్రసరణ మంచిగా సాగుతుంది. స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. కోపాన్ని, బీపీని నియంత్రిస్తుంది. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. దీన్ని మన అధిగమించేందుకు రోజు కనీసం 11 నిమిషాలు నడవడం మంచిదని వైద్యులు పేర్కొన్నారు. వాకింగ్ చేయడం ద్వారా మనలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించు కోవచ్చు. అధిక బరువు కూడా తగ్గించుకోవచ్చు.
నీళ్లు తాగడం:
చలికాలంలో చాలా మంది నీరు తాగడం తగ్గిస్తారు. నీరు తక్కువగా తాగడం ద్వారా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో చర్మంలో తేమ శాతం తగ్గి పొడిబారుతుందని అన్నారు. నీళ్లు తాగడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని పేర్కొన్నారు.
వేడి ఆహారాలు తినడం:
చలి కాలంలో వేడిగా ఉన్న ఆహారాలు తింటే మంచిదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. చలికాలంలో ఆహారం తొందరగా పడు అవుతుందని తెలిపారు. వేడి ఆహారం కాకుండా చల్లబడ్డ ఆహారం తింటే సరిగ్గా జీర్ణం కాదు అని తెలుపుతున్నారు. చలికాలంలో టీ, కాఫీలు, వేడి నీళ్లు తాగడం ఉత్తమం అని పేర్కొన్నారు.