Chocolate Tips: చాక్లెట్స్ అంటే ఇష్టం లేని వారు చాలా కొంత మంది మాత్రమే. చాలా మంది చాక్లెట్స్ ను చాలా ఇష్టంగా తింటారు. కొంత మంది కావాల్సినప్పుడల్లా తినడానికి తమ ఫ్రిడ్జ్ లో చాక్లెట్స్ రెడీ గా పెట్టుకుంటారు. ఇలా చాక్లెట్స్ ఇష్టంగా తినే వారు.. వాటిని నిల్వ చేసే ప్రదేశాల పై కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి. ప్యాక్ చేసిన చాక్లెట్స్ చాలా కాలం నిల్వ ఉంటాయి. కానీ సరైన ప్రదేశాల్లో వాటిని స్టోర్ చేయకుంటే అవి పాడవుతాయి. అలాగే వాటి రుచి, నాణ్యత కూడా తగ్గిపోతుంది. కావున మీ ఇంట్లో చాక్లెట్స్ నిల్వ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలను తీసుకోండి..
చాక్లెట్స్ నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి..
చాక్లెట్స్ ను 15-20°C డిగ్రీల స్థిరమైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. నిల్వ చేసే ఊష్ణోగ్రతలోని మార్పులు చాక్లెట్స్ పై తెల్లని పొరలు ఏర్పడడానికి కారణమవుతాయి. చాక్లెట్ పై ఇలా తెల్లని పొరలు కనిపిస్తే.. చాక్లెట్ పాడవుతుందని సంకేతం. అందుకే చాక్లెట్లను మరీ తీవ్రమైన చలి లేదా వేడికి కాకుండా సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి.
తేమ తగలకుండా చూడాలి
చాక్లెట్స్ ను తేమగా లేని ప్రదేశాల్లో నిల్వ చేయాలి. వాటికి తేమ తగిలినప్పుడు అవి కుళ్లిపోయే అవకాశం ఉంది. అందుకని తేమ తగలకుండా ఏదైనా టైట్ కంటేనర్ లేదా ప్లాస్టిక్ కవర్ తో గట్టిగా ప్యాక్ చేసి స్టోర్ చేయాలి. చాక్లెట్స్ తేమకు గురైనప్పుడు వాటిలోని షుగర్ బయటకు వచ్చి త్వరగా కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
ఘాటు వాసనలకు దూరంగా ఉంచాలి
చాక్లెట్స్ ఘాటు వాసనలను త్వరగా గ్రహిస్తాయి. దాని వల్ల చాక్లెట్స్ పాడయ్యే అవకాశం ఉంది. కావున ఘాటు వాసనను ఇచ్చే ఫుడ్స్, స్పైసెస్, కెమికల్స్ కు దూరంగా.. చాక్లెట్లను నిల్వ చేయాలి.
సీలింగ్ సరిగ్గా చేయాలి
చాలా మంది పెద్ద సైజ్ చాక్లెట్స్ తిన్నపుడు.. కొంచం మాత్రమే తిని మిగతాది పక్కన పెడతారు. అలా ఓపెన్ చేసిన చాక్లెట్ సరిగ్గా ప్యాక్ చేయకుండా వదిలేస్తే వాటి లోపలికి తేమ చేరి త్వరగా పాడవుతాయి. అందుకని ఓపెన్ చేసిన చాక్లెట్స్ ను ఏదైనా టైట్ కంటేనర్ లో సీల్ చేసి పెట్టాలి.
Also Read: Life Style: ఇలాంటి ప్రదేశాల్లో అస్సలు వాకింగ్ చేయకండి.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!