Health Tips: తామర, గజ్జి వల్ల చర్మంలో ఇబ్బందిగా ఉంటుంది. డెర్మటోఫైట్ కారణంగా తామర వస్తుంది. ఇది శరీర భాగాల్లో ఎక్కడైనా సంభవించవచ్చు. వచ్చిన చోట దురదతో పాటు మంట కూడా ఉంటుంది. పరిశుభ్రత పాటించకపోవడం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇది అంటువ్యాధి కూడా. తామర ఉన్నవారి బట్టలు వేసుకున్నా, వస్తువులు వాడినా, కలిసి తిరిగినా వస్తుంది.
జిల్లేడు మొక్క ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో చాలా ఔషధాలు దాగి ఉన్నాయి. సూక్ష్మజీవుల్ని చంపడంలో ఇది బాగా పనిచేస్తుంది. వీటి ఆకులను తుంచితే పాలు వస్తాయి. ఈ పాలను తీసుకొని..అలాగే వేపనూనెను తీసుకోవాలి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. తామర, గజ్జితో పాటు మొటిమలను కూడా వేపనూనె తగ్గిస్తుంది.
గిన్నెలో టీ స్పూన్ వేప నూనె తీసుకుని దాంట్లో నాలుగు చుక్కల జిల్లేడు పాలను కలపాలి. దీన్ని తామర ఉన్న ప్రాంతంలో రాసి బాగా మర్దనా చేయాలి. ఒక మూడు గంటలు అలాగే ఉంచి సబ్బుతో కడుక్కోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయాలి. రెండు వారాల తర్వాత తామర తగ్గిపోతుంది. అయితే ఈ జిల్లేడు పాలను తీసుకునేప్పుడు చేతికి తగలకుండా చూసుకోవాలని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందో చూడండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.