Home Tips: తెల్లని బట్టలు, బూట్లు లేదా ఏదైనా తెల్లని వస్తువు మరకలతో త్వరగా మురికిగా మారుతుంది. ఎన్నిసార్లు సబ్బుతో ఉతికినా మురికిమాత్రం వదలదు. ఎంతకీ మరకపోకపోవడంతో విసుగుచెంది ఆ తెల్లని వస్తువులను పనికిరానిదిగా భావించి వాటిని విసిరిరేస్తుంటాం. లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటాం. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మురికిని సులభంగా పోగొట్టుకోవచ్చు.
వేడి నీటితో కడగండి:
- మరక తాజాగా ఉంటే దానిని నేరుగా చల్లటి నీటితో కడగాలి. కానీ తెల్లటి వస్తువులపై పాత మరకలను తొలగించడానికి ముందుగా ఒక మృదువైన గుడ్డను వేడి నీటిలో ముంచి మరకలు ఉన్న గుడ్డపై వేయాలి. తర్వాత సబ్బును అప్లై చేసి మృదువుగా మసాజ్ చేసి ఆపై శుభ్రమైన నీటితో కడగాలి. దీంతో తెల్లటి వస్తువులపై మరకలు తొలగిపోతాయి.
నిమ్మరసం:
- నిమ్మరసాన్ని మరక ఉన్న ప్రదేశంలో 15 నుంచి 20 నిమిషాలు అప్లై చేసి ఆపై గోరువెచ్చని నీటితో కడగడం వల్ల బట్టలపై మరకలు పోతాయి.
సోడా ఉప్పుతో ప్రయోజనం:
- తెల్లటి వస్తువులపై మరకలను తొలగించడానికి సోడా ఉప్పును నీటితో కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఆ తర్వాత పేస్ట్‌ను మరకలు, మచ్చలపై అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మొండి మరకలు వదిలిపోతాయి.
వెనిగర్:
- వెనిగర్‌ను నీటిలో కలిపి మరక మీద అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. మరకలు తొలగిన తర్వాత బట్టలను ఎండలో ఆరబెడితే మరకలు కనిపించవు.
ఇది కూడా చదవండి: కూతుర్లతో ఇలా ప్రవర్తించారంటే వాళ్ల దృష్టిలో సూపర్ మ్యాన్ అవుతారు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.