/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Tips-for-planting-vegetables-in-summer-jpg.webp)
Vegetables Tips: వేసవిలో కూరగాయలు త్వరగా పాడవుతాయి. ఇది కూరగాయల రుచిని పాడుచేయడమే కాకుండా వాటి పోషకాలను తగ్గిస్తుంది. కానీ జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా కూరగాయలను వేసవిలో కూడా తాజాగా ఉంచుకోవచ్చు. కడిగిన తర్వాత కూరగాయలను పొడిగా ఉంచండి. ఎందుకంటే అవి తడిగా ఉంటే తొందరగా పాడవుతాయి. పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. ఇలా చేస్తే కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. ఈ ఉష్ణోగ్రత కూరగాయలకు సరైన. ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. కూరగాయలను ఈ ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల అవి తాజాగా ఉండటమే కాకుండా వాటి రుచి, పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. అందుకే ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతను సరిగ్గా సెట్ చేయడం చాలా ముఖ్యం. కూరగాయలను ఒకదానిపై ఒకటి పేర్చవద్దు. వాటిని దూరంగా ఉంచండి. దీని వల్ల గాలి బాగా అందుతుంది. కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
టమోటో, దోసకాయ వంటి కొన్ని కూరగాయలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. వాటిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది. ఈ కూరగాయలను చాలా చల్లని వాతావరణంలో ఉంచినట్లయితే అవి త్వరగా పాడవుతాయి. కాబట్టి వాటిని సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. కూరగాయలను పేపర్ టవల్‌లో చుట్టండి. ఇది వాటి నుంచి అదనపు తేమను గ్రహిస్తుంది. ఎక్కువ కాలం వాటిని తాజాగా ఉంచుతుంది. ఈ చిట్కాలన్నీ వేసవిలో కూరగాయలను తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఇంట్లోనే మంచి ఫేస్ స్క్రబ్ ఇలా తయారు చేసుకోండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.