Tiger roaming in Sangareddy: జన సంచారంలోకి మృగాలు రావడంతో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో జనం బంబేలెత్తిపోతున్నారు. మొన్న వనస్థలిపురంలో పులి సంచారం కలకలం రేపితే.. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే జిన్నారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచారం ఆనవాళ్ళు లభించాయని స్థానికులు చెబుతున్నారు.
మూగజీవాలపై ఎటాక్ చేస్తున్న పులి..!
అయితే గత కొన్ని రోజులుగా జిన్నారం మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారిస్తుందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అనేక సందర్భాల్లో మూగజీవాలను చంపిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం మేతకు వెళ్లిన ఆవుపై దాడి చేసి మెడను కొరికి చంపేసింది పులి. దీంతో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు.
ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు..!
అయితే ఆవు మెడను కొరికి పులి చంపడం మొదటి సారి కాదని జిన్నారం మండలం వాసులు చెబుతున్నారు. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే మూగజీవాలపై పులి దాడికి దిగిందని.. మండలంలోని పలు మూగ జీవాలపై దాడికి దిగినప్పుడల్లా అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని వారు చెబుతున్నారు. ఇక ఇప్పటికే అనేక సార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పులి దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని, పులిని బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
జిమ్ సెల్లార్ లో రాహుల్ మర్డర్..మామూలుగా ట్విస్ట్ లు లేవుగా.. ప్రేమ వ్యవహారమే!! https://rtvlive.com/rahuls-murder-in-the-gym-cellar-no-twists-as-usual-its-a-love-affair/