/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/tiger.jpg)
Rajahmundry : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగర శివారులో పులి కలకలం సృష్టించింది. పులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి జాడ కనుక్కొనేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. స్థానికంగా ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. గతంలో కూడా రాజమండ్రి నగర శివారు ప్రాంతంలో పులి సంచరించినట్లు తెలుస్తోంది. దీంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.