Salman, Katrina Dance video: సల్మాన్, కత్రినా డాన్స్ వీడియో వైరల్..!

New Update
Salman, Katrina Dance video: సల్మాన్, కత్రినా డాన్స్ వీడియో వైరల్..!

Salman, Katrina Dance video: బాలీవుడ్ స్టార్స్ సల్మాన్, కత్రినా కలిసి ప్రధాన నటించిన చిత్రం టైగర్-3. తాజాగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాలీవుడ్ బాస్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళను సాధిస్తోంది. ఐదు రోజుల్లోనే 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా టైగర్ - 3 చిత్ర బృందం ముంబైలోని ఓ థియేటర్ కు వెళ్లి ఫ్యాన్స్ తో కలిసి సందడి చేశారు. సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడంతో థియేటర్ లో సల్మాన్, కత్రినా అభిమానులతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. థియేటర్ లో అభిమానుల కోరిక మేరకు ఓ సూపర్ హిట్ పాటకు స్టెప్పులేసి అలరించారు సల్మాన్, కత్రినా. దీనికి సంబంధించిన వీడియోను టైగర్ - 3 నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తమ సోషల్ మీడియా వేదిక పై షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్లు పెడుతూ అభినందనలు తెలియజేశారు.

publive-image

Also Read: రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోపై స్పందించిన మాజీ ప్రియుడు.. ఎమన్నాడో తెలుసా?

టైగర్-3 సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడారు. ఈ సినిమా విజయం నాకు హ్యాట్రిక్ తో సమానం.. సినిమాలో యాక్షన్ హీరోగా నటించడం చాలా గొప్పగా, ఆనందంగా ఉందని తెలిపారు. యాక్షన్ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం అంత సులువైన పని కాదు.. ఏదో ఒక ప్రత్యేకమైన కొత్తదనాన్ని సినిమాలో ఆవిష్కరించాలి. ప్రేక్షకులు నన్ను ఇంతలా ఆదరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు.

publive-image

publive-image

Also Read: Prakash raj: చేసిందేమి లేదంటూ.. మా ప్రెసిడెంట్ పై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్‌!

Advertisment
తాజా కథనాలు