Amalapuram: అమలాపురం వైసీపీలో అయోమయం.. టికెట్ కోసం తండ్రీకొడుకుల మధ్యే వార్!

అంబెద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తండ్రి కొడుకుల మధ్య టిక్కెట్ వార్ నడుస్తోంది. అధిష్టానం ఇప్పటికే మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పేరును ఖరారు చేసారని ప్రచారం జరుగుతుండగా..ఈసారి కూడా నేనే పోటీ చేస్తా అంటూ మంత్రి విశ్వరూప్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

New Update
Amalapuram: అమలాపురం వైసీపీలో అయోమయం.. టికెట్ కోసం తండ్రీకొడుకుల మధ్యే వార్!

Amalapuram: అంబెద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తండ్రి కొడుకుల మధ్య టిక్కెట్ వార్ నడుస్తోంది. అమలాపురంలో వైసీపీ నుండి నేనే పోటీ చేస్తా అంటూ మంత్రి పినిపే విశ్వరూప్(Minister Vishwaroop) చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పనితీరు సామర్ధ్యం బట్టే టిక్కెట్ లు మారుస్తున్నారన్నా ఆయన.. అమలాపురం నుండి నేనే పోటీ చేస్తున్న ఎలాంటి సందేహం లేదు అని చెప్పుకొచ్చారు. టిక్కెట్ మార్పు విషయంలో మొదటిసారి నోరు విప్పారు మంత్రి విశ్వరూప్.

Also Read: మైలవరంలో వైసీపీకి షాక్..కీలక నేత రాజీనామా

అయితే, అధిష్టానం ఇప్పటికే మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పేరును ఖరారు చేసారని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏమో తండ్రి మంత్రి విశ్వరూప్ నేనే పోటీ చేస్తాను అనడంతో ప్రజలు గందరగోళంలో పడ్డారు. టిక్కెట్ విషయంలో తండ్రి కొడుకుల మధ్యే విబేధాలు ఏర్పడ్డాయి అన్న ఆరోపణలకు మంత్రి ప్రకటనతో బట్టబయలు అయ్యాయని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా, నేనే ఇంఛార్జీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు మంత్రి కుమారుడు శ్రీకాంత్. రెండో లిస్టులో కుమారుడు పేరు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: జూబ్లీహిల్స్‌లో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. తొలిసారి బ్రౌన్‌షుగర్ పట్టివేత..

దీంతో, తనకు కాకుండా కుమారుడుకి టిక్కెట్ ఇస్తారు అనే ప్రచారంతో మంత్రి విశ్వరూప్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రిని కాదని తన సొంత పలుకుబడిని, వైసిపి పెద్దల సహకారంతో శ్రీకాంత్ టిక్కెట్ ట్రైల్స్  చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏమో కొడుకు శ్రీకాంత్ కు టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని సీనియర్ వైసీపీ నేతలు సంకేతాలు ఇస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. టిక్కెట్ విషయంలో నేనంటే నేను అంటూ తండ్రి కొడుకుల మధ్యే వార్ జరుగుతుందని నియోజకవర్గంలో రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు