thummalagunta: వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల తరహాలో తుమ్మలగుంటలో శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబ్‌తో కళకళలాడుతోంది.

New Update
thummalagunta: వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

దేవతా మూర్తుల రూపాలతో

తిరుమలలో శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల తరహాలో తుమ్మలగుంటలో శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబ్‌తో కళకళలాడుతోంది. గోడలపై దేవతామూర్తుల ప్రతిమలను ముద్రించడం, విద్యుత్‌ దీపాలు ఏర్పాట్లతో తుమ్మలగుంట వైభవంగా మారింది. అంతేకాదు తిరుపతి,చంద్రగిరి దారిలోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నుంచి తుమ్మలగుంట గ్రామానికి వెళ్లే మార్గంలో డెయిరీ ఫాం గోడలు, గ్రామంలో రోడ్లకు ఇరువైపులా చిత్రీకరించిన దేవతా మూర్తుల రూపాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

స్వామికి పట్టు వస్త్రాలు 

తుమ్మలగుంటలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం ఉదయం స్వామి వారు శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ గ్రామ వీధుల్లో కోలాహలంగా వాహన సేవ ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. ఇందులో చందనం, పసుపు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గాంధీపురం, అవిలాల, లింగేశ్వర నగర్, సాయినగర్ పంచాయతీల నుంచి ప్రజలు పాదయాత్రగా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వాహన సేవలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈవో సబ్రమణ్యంరెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, కంక‌ణ‌బ‌ట్టార్ గిరిధర్ భట్టాచార్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యాలపై దృష్టి

స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తుమ్మలగుంట గ్రామంలోని ప్రధాన వీధులతో పాటు ఆలయ పరిసరాలు, వేద పాఠశాల, పుష్కరిణి, అన్న ప్రసాదాల తయారీ వద్ద భక్తులతో నిందిడిపోయింది. ఇప్పటికే స్వామివారి గర్భాలయాన్ని సుగందభరిత పరిమళాలతో ఆలయ అర్చకులు శుద్ధి చేశారు. శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తలు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నీ ఏర్పాట్లను పర్యవేక్షస్తున్నారు. అంతేకాకుండా ఉత్సవ ఏర్పాట్ల విషయంలో.. భక్తుల సౌకర్యాలు దృష్టిలో ఉంచుకుని నిరతరం కృషి చేస్తున్నారు. ఆలయ అధికారులు ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తున్నారు. భక్తుల ఏర్పాట్ల విషయంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు