గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రిపొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మంలో పర్యటించారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఇది ఆయన మొదటి పర్యటన. ఇక పొంగులేటితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా జిల్లా పర్యటనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా సరిహద్దులోని కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద పొంగులేటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. అంతేకాకుండా రెండు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇదే క్రమంలో ఖమ్మం బస్టాండ్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala nageswarrao) చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి.
This browser does not support the video element.
తుమ్మల ఏం అన్నారంటే?
-->ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడిగి తలమీద పోసుకున్నా మీ రుణం తీరదు.
-->మీరు మా మీద చూపిన ప్రేమ మములుది కాదు.
-->రాజకీయాల్లోంచి తప్పుకుందాం అనుకున్న భట్టి గారు నా పదవిని 5 ఏళ్ళు పెంచారు.
-->ఎవడు బెదిరించిన భయపడేది లేదు.
-->కబ్జాలను రికవరీ చేయండి.
-->గత 5 ఏళ్లలో మీరు చేసిన సరిదిద్దుకోండి.
-->కలెక్టర్,సీపీ ఇక్కడే ఉండాలి.. మీరే సేవ చేయాలి.
-->ఎవడి మాటలో విని మమ్మల్ని, ప్రజల్ని, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారు.
--> వాటన్నిటినీ సరిదిద్దుకోండి అంటూ జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్‌నుద్దేశించి ఘాటైన తుమ్మల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పనికిమాలిన వ్యక్తులు ఎవరు?
గతంలో పనికి మాలిన వ్యక్తుల ఒత్తిడి వల్ల మీరు కొన్ని తప్పులు చేశారంటూ కలెక్టర్, సీపీని టార్గెట్ చేస్తు తుమ్మల వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అ పాపం వాళ్ళతోనే పోతుంది తప్ప మీది కాదని.. ఇప్పటికైనా సిట్ రైట్ చేసుకోండంటూ చురకలించారు తుమ్మల. 'ఎక్కడైన తప్పుడు కేసులు పెట్టినా.. ఎవడైనా కబ్జాలు చేసినా.. ఎవడైనా బెదిరించినా' అంటూ ఫైర్ అయ్యారు తుమ్మల. మీరు ఇక్కడే ఉండాలి.. ఇక్కడే ప్రజలకు సేవ చేయాలంటూ కామెంట్స్ చేశారు. మిరెప్పుడూ తెలంగాణలోనే ఉంటారని.. ఖమ్మంలో వుంటారా కరీంనగర్ లో ఉంటారా ఎక్కడున్నా ప్రజా సేవ చేయడమే మన బాధ్యత అని తెలిపారు. గత అయిదు సంవత్సరాల్లో కొన్ని తప్పులు జరిగాయని ఎన్నికల ప్రచారంలో తెలిసిందని.. అవన్నీ మీ ఇద్దరి దృష్టికి తీసుకొనివస్తానని.. అవన్నీ మీరే చూసుకోవాలని తెలిపారు తుమ్మల.
Also Read: ప్రేయసితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోండిలా.. లవ్ టిప్స్!
WATCH: