Thummala Nageswara Rao: రూటు మార్చుతున్న తుమ్మల..త్వరలో సంచలన నిర్ణయం!!

అధికార పక్షం బీఆర్ఎస్ లో టికెట్ రాని వాళ్లు అసమ్మతి వెళ్లగక్కుతూనే ఉన్నారు. దీంతో ఇప్పట్లో ఆ సెగలు చల్లారేట్టుగా కనిపించడం లేదు. ఓ వైపు బీఆర్ఎస్ అధిష్టానం పై తమ అసమ్మతిని ప్రదర్శిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డారు టికెట్ దక్కని క్యాండిడేట్లు. అయితే రేఖానాయక్ ఇంకా వేముల వీరేశం లాంటి వాళ్లు బాహాటంగానే అసమ్మతిని గక్కి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక తుమ్మల కూడా దూకుడు పెంచి.. తన బలప్రదర్శనకు దిగారు..

New Update
Thummala Nageswara Rao: రూటు మార్చుతున్న తుమ్మల..త్వరలో సంచలన నిర్ణయం!!

Thummala Nageswara rao: అధికార పక్షం బీఆర్ఎస్ (BRS) లో టికెట్ రాని వాళ్లు అసమ్మతి వెళ్లగక్కుతూనే ఉన్నారు. దీంతో ఇప్పట్లో ఆ సెగలు చల్లారేట్టుగా కనిపించడం లేదు. ఓ వైపు బీఆర్ఎస్ అధిష్టానం పై తమ అసమ్మతిని ప్రదర్శిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డారు టికెట్ దక్కని క్యాండిడేట్లు. అయితే రేఖానాయక్ (Rekha Nayak) ఇంకా వేముల వీరేశం (Vemula Veresham) లాంటి వాళ్లు బాహాటంగానే అసమ్మతిని గక్కి పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఇక తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విషయంలో అధిష్టానం చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ అయినట్టుగా కనిపించడం లేదు. రెండ్రోజుల క్రితం తుమ్మల ఇంటికి అధిష్టానం ఎంపీ నామా నాగేశ్వర్ రావును పంపింది. టికెట్ బదులుగా నామినేటెట్ పోస్ట్ ల ఆఫర్లు ఇచ్చింది. అయితే తుమ్మల మాత్రం రూట్ మార్చి తన బలప్రదర్శనకు దిగారు.

పంటి నొప్పితో హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం గచ్చిబౌలి మై బుజా నుంచి ఖమ్మం వరకు భారీ కాన్వాయ్ తో బయల్దేరి వెళ్ళారు. అక్కడ తన అభిమానులు, అనుచరులతో మీటింగ్ నిర్వహించిన తరువాత తన నెక్ట్స్ కార్యాచరణను ప్రకటిస్తానని మాజీ  మంత్రి తుమ్మల నాగేశ్వర్ తెలిపారు.

బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని ఒత్తిడి..!

తుమ్మలకు బీఆర్ఎస్ పాలేరు నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో.. ఆయన వర్గీయులు మాత్రం ఆయన్ని పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కూడా బయటికి రావాలని ఆయన్ని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కాగా, 2014 ఎన్నికల తరువాత ఆయన కేసీఆర్ పిలిస్తే టీడీపీ (TDP) నుంచి బీఆర్ఎస్ లో చేరారు. అయితే పార్టీలోకి చేరిన కొన్ని రోజులకే కేసీఆర్ ఆయన్ని కేబినెట్ లోకి తీసుకున్నారు. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి ఆయనకు టికెట్ ఇవ్వగా.. ఆయన ఓడిపోయారు. అయితే ఈ సారి కూడా పాలేరు నుంచి టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. కాని ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆఫర్లు..!

పాలేరు నుంచి టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్న సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావుకు ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ (Congress) ఇంకా బీజేపీ (BJP) నుంచి ఆఫర్లు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అందుకే తుమ్మల ముందుగా తన బలప్రదర్శను చూపించి తరువాత పార్టీకి గుడ్ బై చెప్పాలని చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఆయన కాంగ్రెస్ గూటికా లేక బీజేపీ లోకా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: నేను కావాలని చేయలేదు..అనుకోకుండా జరిగింది.. సారీ కూడా చెప్పాను: తలసాని!!

Advertisment
తాజా కథనాలు