Chhattisgarh : దండకారణ్యంలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి

దండకారణ్యం మరోసారి కాల్పల మోతతో దద్దరిల్లింది. ఆదివారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు నడిచింది. ఈ కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు చనిపోగా మరికొందరు గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.

Chhattisgarh: దండకారణ్యంలో తుపాకుల మోత.. 11 మంది మృతి!
New Update

Encounter : ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. కాంకేర్‌ జిల్లా కోయిలీబేడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బోమ్రా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టు దళాల మధ్య ఆదివారం సాయంత్రం భీకర పోరు(Security Forces-Maoist Forces War) జరిగింది. ఒకరిపై ఒకరు కాల్పులు పాల్పడగా సాయుధులైన ముగ్గురు మావోయిస్టులు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు.

గంటలపాటు కాల్పులు..

ఈ మేరకు దండకారణ్యం అటవీ ప్రాంతంలో మావోయిస్టు కంపెనీ-5కు చెందిన కొందరు సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందగానే డీఆర్జీ, బీఎస్‌ఎఫ్‌(DRG, BSF) జవాన్లు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బోమ్రా-హుర్తరాయి అటవీ ప్రాంతాల గుట్టల మధ్య నుంచి భద్రతా బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు ముప్పేట దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. కొన్ని గంటలపాటు సాగిన కాల్పులతో దండకారణ్యం మార్మోగింది. మావోయిస్టులు అడవిలోకి పారిపోగా ఎన్ కౌంటర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు మూడు మావోయిస్టుల మృతదేహాలు దొరికినటలు తెలిపారు. మరికొందరు తీవ్ర గాయాలతో తప్పించుకున్నారని, ఘటన స్థలిలో మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఇది కూడా చదవండి: Nalgonda:పోలీసుల ప్రాణాలమీదకొచ్చిన గొర్రెల పంచాయితీ..ఎస్‌ఐపై దాడి!

ఈ ఘటనను కాంకేర్‌ జిల్లా ఎస్పీ కల్యాణ్‌ అలెసెల పరిశీలించారు. మృతిని వివరాల కోసం సమాచారం సేకరిస్తున్నట్లుతెలిపారు. అలాగే బీజాపూర్‌ జిల్లా బేచపాల్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులు పేలి సీఏఎఫ్‌(ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌) హెడ్‌కానిస్టేబుల్‌ చనిపోయారు. మిర్తూర్‌ ఠాణా పరిధిలోని సీఏఎఫ్‌-19(ఎ) కంపెనీకి చెందిన జవాన్లు కూంబింగ్‌ చేపట్టిన క్రమంలో ఐఈడీ బాంబులపై హెడ్‌కానిస్టేబుల్‌ రామ్‌ ఆశీష్‌ యాదవ్‌(58)ప్రమాదవశాత్తు కాలువేశారు. దీంతో అది పేలడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

#anti-naxal-operation #three-naxalites-killed #chhattisgarh #security-forces-maoist-forces-war
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe