BREAKING: మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు.. ముగ్గురు మృతి!

ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో మరోసారి తుపాకీ పేలింది. దంతెవాడ జిల్లా దబ్బకూన అటవీప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

New Update
BREAKING: మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు.. ముగ్గురు మృతి!

ఇటీవలి కాలంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరుగుతున్న కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. నాలుగు రోజుల క్రితం సుక్మాజిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిథిలోని దండకారణ్యంలో మావోయిస్ట్ బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇందులో భారీ మొత్తంలో మావోయిస్టుల సామాగ్రిని, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో భద్రతాబలగాలు ఎనిమిది మంది మావోస్టులను చంపినట్టు అధికారిక వర్గాల నుంచి సమాచారం. అయితే తాజాగా మరో ఘటన జరిగింది. ఈ సారి ముగ్గురు మావోయిస్టులు మరణించారు.

ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో మరోసారి తుపాకీ పేలింది. దంతెవాడ జిల్లా దబ్బకూన అటవీప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో
ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పులను దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ధృవీకరించాయి.

ఈ డిసెంబర్‌ 17న కూడా సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సబ్ ఇన్‌స్పెక్టర్ మరణించగా, కానిస్టేబుల్ గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్ 165వ బెటాలియన్‌కు చెందిన బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో ఉండగా జాగర్‌గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఏడాది(2023) ఏప్రిల్‌ 26న మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10మంది జవాన్లు చనిపోయారు. దంతేవాడలో మావోయిస్టులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేయగా.. ప్రతీకార చర్యగ 10 మంది భద్రతా సిబ్బంది, ఒక డ్రైవర్‌ని మావోయిస్టులు చంపేశారు.

ఇక ఇటీవల బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు గాయపడ్డాడు. జంగ్లా ప్రాంతంలోని పోతేనార్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. పోతేనార్ అడవుల్లో మావోయిస్టులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. తెలంగాణ సరిహద్దుకు సమీపంలోని పరాలగట్ట అడవుల్లో ఆరుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు. నవంబర్ 21న బడే పల్లి వద్ద జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో వీరంతా పాల్గొన్నారు.

Also Read: అంతా తూచ్‌.. పాండ్యా వస్తున్నాడట.. ఇదెక్కడి లొల్లి భయ్యా!

WATCH

Advertisment
తాజా కథనాలు