కాకినాడ జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ముగ్గురు వ్యక్తులు మరణించారు. గ్రామంలోని పామాయిల్ తోటలో బోరు కొట్టేందుకు పనులు చేస్తున్న తరుణంలో పైన విద్యుత్ లైన్ యొక్క వైర్లను పైపులు తాకిన్నాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ముగ్గురు కూలీలు దుర్మరణం అయ్యారు. మృతులు బోదిరెడ్డి సూరిబాబు, బూరుగుపూడి కిల్లినాగు, గల్లా బాబి(నాగరాజు)గా గుర్తించారు. మృతులను బోదిరెడ్డి సూరిబాబు (35), కిల్లినాడు (40), గల్ల బాబీ (24) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్త దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న జగ్గంపేట పోలీసులు, సంఘనాస్థలిని పరిశీలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
This browser does not support the video element.
వరస ఘటనలు..
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట గాంధీబజార్‌లోని వినాయకుడి మండపం వద్ద విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో కాల్వ మణికంఠ (17) అనే యువకుడు మృతి చెందాడు. ఈఘటన నిన్న చోటుచేసుకుంది. రాత్రి వర్షం కురవడంతో వినాయకుడి మండపం తడిచి ముద్దయింది. పక్కనే ఉన్న ఒక ఇనుప పైపుకి విద్యుత్ సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించని కాల్వ మణికంఠ ఆ పైపును తాకాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే కంభం ప్రభుత్వాస్పత్రికి తరలింగా..అప్పటికీ ఆ యువకుడు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
This browser does not support the video element.
ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందారు. ఏ కొండూరు మండలం, గొల్లమందల గ్రామంలో గుజ్జా ముత్తయ్య(40) అనే రైతు రాత్రి పొలానికి నీరు పెట్టడానికి వెళ్ళగా విద్యుత్ మోటార్ ఆన్ చేస్తూ ఉండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడటంతో శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఉన్నారు.
హైదరాబాద్‌లో ఘటన
జీడిమెట్ల పీఎస్ పరిదిలోని చింతల్ బస్టాప్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి నలుగురికి యువకులకు గాయాలైయ్యాయి. స్వాగత ఫ్లెక్సీలు కడుతున్న యువకులకు ఈ ప్రమాదానికి గురైయ్యారు. అయితే రెండో విడత డబుల్‌బెడ్ రూంలు పంపిణీ కోసం కుత్బుల్లాపూర్‌కి ఓ మంత్రి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 5 గంటల సమయంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో నలుగురికి విద్యుత్ షాక్ తగిలి చికిత్స పొందుతున్నారు. విఠల్ (19), దుర్గేష్ (19), బాలరాజు(18), నాగనాథ్(33)గా గుర్తించారు. అందులో నాగ్‌నాథ్ (33) అనే వ్యక్తికి తీవ్ర గాయాలైయ్యాయి. వీరందరిని చికిత్స నిమిత్తం స్థానిక RNC ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఈనెల 20న చోటుచేసుకుంది.
This browser does not support the video element.