/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/revanth-reddy-jpg.webp)
Indiramma Houses: భద్రాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందిరమ్మ ఇళ్లుల ప్రత్యేకత గురించి తెలుసుకోవడానికి ప్రజలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు విశాలంగా, అద్భుతంగా నిర్మించుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణానికి 4 దశల్లో ఆర్థికసాయం చేయనున్నారు. 400 గజాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. 2 బెడ్‌రూమ్స్‌తో పాటు హాల్, కిచెన్, వాష్‌రూమ్స్ నిర్మించనున్నారు.
నేరుగా లబ్ధిదారులకే..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై అభయహస్తం ముద్ర కూడా వేయనున్నట్లు తెలుస్తోంది. చుట్టూ కాంపౌండ్ వాల్, త్రీ కలర్స్‌లో పెయింటింగ్ చేయించనున్నారు. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ..బేస్‌మెంట్ స్థాయిలో రూ.లక్ష, పైకప్పు స్థాయిలో మరో లక్ష..పైకప్పు నిర్మాణం తర్వాత రూ.2లక్షలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. నిర్మాణం పూర్తయ్యాక మరో లక్ష ఆర్థికసాయం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆధార్ కార్డ్ ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Also Read: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టు మొట్టికాయలు..
పథకానికి అనర్హులు
రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందికి ఇళ్లివ్వాలని ప్రభుత్వ లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గానికీ 3,500 ఇళ్లిచ్చేలా ప్లాన్ చేస్తోంది. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం 80లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అయితే, గతంలో ఇళ్లు పొందినవారు ప్రస్తుత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులుని చెబుతున్నారు. ప్రస్తుతం 30 నుంచి 35లక్షల మంది లబ్ధిదారులున్నట్టు గుర్తించారు.
తప్పనిసరిగా..
మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వర్తిస్తుందని..లబ్ధిదారుడు తప్పనిసరిగా బీపీఎల్‌కు దిగువన ఉండాలని అంటున్నారు. రేషన్‌కార్డ్ ఆధారంగా లబ్ధిదారుడి ఎంపిక జరుగుతోంది. అర్హులకు సొంత స్థలం ఉండాలి లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలని.. గుడిసె లేదా తాత్కాలిక ఇల్లున్నా అర్హులేనని తెలుస్తోంది. వివాహమైనా ఉమ్మడి కుటుంబంలో ఉన్నా లబ్ధిదారుడిగా ఎంపిక చేస్తున్నారని.. ఒంటరి, వితంతు మహిళలూ లబ్ధిదారులేనని వార్తలు వినిపిస్తున్నాయి.