/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rain-1-jpg.webp)
Rain Alert: హైదరాబాద్ వాతావరణ శాఖ రైయిన్ అపడేట్ ఇచ్చింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇది ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం సమీపంలోని పశ్చిమబంగ, ఒడిశా తీరాల్లో కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది.
రెండు రోజుల్లో ఇది వాయవ్య దిశగా కదిలి జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని కేంద్రం పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌తోపాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురువొచ్చని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చాలా చోట్ల రేపు మరియు ఎల్లుండి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు భారీ వర్షములు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని జాగ్రత్తలు చెప్పింది.
Also Read: ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిన మూవీని..నేషనల్ క్రష్ ఎంచుకుందా..?