ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లను హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఆ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వరుసగా రెండు కాల్స్ రావడంతో స్పెషల్ గా ఓ టీంను ఏర్పాటు చేసిన విచారణ చేపట్టారు. ముందు ఫోన్ చేసి బీహార్ సీఎం నితీష్ కుమార్ ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తి…తర్వాత మరోసారి ఫోన్ చేశాడు. మోడీతోపాటు అమిత్ షాను హత్య చేస్తామంటూ బెదిరించాడు.
ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు ఫోన్ కాల్స్ చేసిన యువకుడిని గుర్తించారు. యువకుడి పేరు సంజయ్ వర్మ అని తెలుస్తోంది. అతని కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించారు. మద్యం మత్తులో సంజయ్ వర్మ ఈ ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ఢిల్లీలోని మదీపూర్ నివాసిగా గుర్తించారు.
Delhi Police's outer district police received two PCR calls today from a man who threatened to kill the Prime Minister, Union Home Minister and Bihar CM; a team deployed to locate the caller, say Delhi Police.
— ANI (@ANI) June 21, 2023