Thota Rajeev: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వకూడదన్నారు కాపు ఉద్యమ నేత తోట రాజీవ్. Rtv తో ఎక్స్‌క్లూజీవ్ గా మాట్లాడుతూ.. గంటా శ్రీనివాసరావుపై విమర్శలు గుప్పించారు. గంటా ఎవ్వరినీ ఎదగనివ్వడని కామెంట్స్ చేశారు. కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. కాపు జాతికి ఆయన చేసిందేమీ లేదన్నారు. విశాఖ అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆలోచించలేదని వ్యాఖ్యనించారు.
Also Read: జవహర్ వద్దు – టీడీపీ ముద్దు.. బయటపడ్డ వర్గ విభేదాలు..!
గంటా శ్రీనివాసరావుకు తనకు వ్యక్తిగతంగా ఏలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. ఆయన గెలుపు కోసం తాను కష్టపడినట్లు తెలిపారు. గెలిపించాలని కాళ్ళ మీద పడ్డాడన్నారు. రాజీనామా అనేది కేవలం నాటకమన్నారు. స్పీకర్ ను కలిసి మీ పార్టీలోకి వస్తానని చెప్పి రాజీనామా ఆమొదించకుండా చేసుకున్నాడని పేర్కొన్నారు. గంటా కేవలం అతని కోసమే రాజకీయం చేస్తున్నాడు తప్ప..ప్రజల కోసం కాదన్నారు.
Also Read: శింగనమల నియోజకవర్గంలో రగులుతున్న వర్గపోరు
కాగా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2022 ఫిబ్రవరిలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దాదాపు మూడేళ్ల తరువాత తన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించారు. తీరా ఎన్నికల ముందు రాజీనామాకు ఆమోదం తెలపడంపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీని వెనుక రాజకీయ కోణం ఉందని హై కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.