ఇప్పటి వరకు డాక్టర్ కోర్స్ చదవాలంటే..కచ్చితంగా ఇంటర్ లో బయాలజీ చదివి ఉండాలి ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ ఇంటర్ లో బయాలజీ లేకపోయినప్పటికీ కూడా డాక్టర్ చదవవచ్చు అంటుంది.
ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ తో పాటు ఇంగ్లీష్ కూడా పాస్ అయితే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశానికి నీట్-యూజీ పరీక్షలో హాజరు కావడానికి అనుమతి ఉంటుంది.
డాక్టర్ కోర్సు చదవాలంటే ఇంటర్ లో కచ్చితంగా ఇంగ్లీష్ తో పాటు ఫిజిక్స్,కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీకి సంబంధించి రెండు సంవత్సరాలు రెగ్యూలర్ గా చదివి ఉండాలి. ప్రైవేట్ అభ్యర్థులు ఇందుకు అనర్హులని అధికారులు ఎప్పుడో పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనలను ఎన్‌ఎంసీ తిప్పి కొట్టింది. ఇంటర్ లో బయాలజీ/ బయో టెక్నాలజీ లేకపోయినప్పటికీ కూడా డాక్టర్ విద్యను అభ్యసించవచ్చని ఎన్‌ఎమ్‌సీ పేర్కొంది.
అయితే దీని గురించి ఇంకా చర్చలు నడుస్తున్నాయని అధికారులు వివరించారు. ఇంటర్ లో మ్యాథ్స్ చేసినప్పటికీ కూడా డాక్టర్ అవ్వవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. విదేశాలలో మెడిసిన్ చదవడానికి అర్హత సర్టిఫికేట్ మంజూరు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Also read: సికింద్రాబాద్- విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు!