Open school: ఓపెన్ స్కూల్ లో చదివిన వారికి షాక్.. ఆ ఉద్యోగాలకు అనర్హులే!?

ఓపెన్‌ స్కూల్‌ లో చదివి, టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ షాక్ ఇవ్వనుంది. ఇందులో విద్యనభ్యసించిన వారు టెట్, డీఎస్సీ రాసేందుకు అర్హులు కాదని, దరఖాస్తులు నిరాకరిస్తునట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.

New Update
Open school: ఓపెన్ స్కూల్ లో చదివిన వారికి షాక్.. ఆ ఉద్యోగాలకు అనర్హులే!?

TET-DSC: ఓపెన్‌ స్కూల్‌ లో విద్యాభ్యాసం పూర్తిచేసిన వారికి విద్యాశాఖ ఊహించని షాక్ ఇవ్వనుంది. ఇందులో చదివిన అభ్యర్థులకు టెట్ ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించట్లేదని తెలుస్తోంది. గతంలో టెట్‌ రాసి ఉత్తీర్ణులైన వారుకూడా డీఎస్సీ రాసేందుకు అర్హులు కాదని, ఇందుకు సంబంధించిన దరఖాస్తులను కూడా నిరాకరింస్తున్నట్లు సమాచారం.

25 వేల మందికి నిరాశ..
ఈ మేరకు ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రెండు రోజుల్లో స్పష్టత రాబోతుండాగ.. దాదాపు 25 వేల మంది నిరుద్యోగులు డీఎస్సీ పరీక్షలకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. గతంలో ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌’ ఇంటర్‌ ఉత్తీర్ణతతో డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా వీటిని రెగ్యులర్‌ డీఎడ్‌ కోర్సులతో సమానంగా పేర్కొన్నారు. వీరంతా కూడా టెట్‌ పరీక్షలు రాశారు. టెట్‌ దరఖాస్తులో అర్హత కాలంలో డీఎడ్‌కు బదులు ‘ఇతరులు’అనే కాలంతో వీళ్లు దరఖాస్తు చేశారు.

ఇది కూడా చదవండి: JOBS: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ షాక్.. మరో ఎగ్జామ్ వాయిదా!

అలాగే ఈ అంశంపై సుప్రీంకోర్టు జనవరిలో కీలక తీర్పు చెప్పింది. రెగ్యులర్‌ డీఎడ్‌తో ఇది సమానం కాదని స్పష్టం చేసింది. కేవలం ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగానే పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో టెట్‌, డీఎస్సీకి ఎవరు దరఖాస్తు చేసినా, వెరిఫికేషన్‌లో పక్కన పెట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు